You are here
Home > Latest News > టీడీపీ తెలంగాణలో ఏనాడో భూస్థాపితం అయిన పార్టీ

టీడీపీ తెలంగాణలో ఏనాడో భూస్థాపితం అయిన పార్టీ

Spread the love
  • తెలంగాణలో దిక్కూదివానం లేకుండా పోయిన టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తుందా రమణ
  • టీడీపీ తెలంగాణలో ఏనాడో భూస్థాపితం అయిన పార్టీ
  • దానికి నూకలు ఎప్పుడో చెల్లిపోయాయి
  • ఏపీలోనే టీడీపీకి దిక్కులేదు.. తెలంగాణలో గెలుస్తారట..

తెలంగాణ ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా.. బొంద పెట్టినా.. టీడీపీ నాయకులకు ఇంకా బుద్ధి రావడం లేదు. తెలంగాణలో ఇంకా టీడీపీ ఉందా రమణ. ఏపీలోనే టీడీపీకి దిక్కుదివానం లేదు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని ఎలా ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయిన పార్టీ.  దానికి నూకలు చెల్లిపోయాయి.

పోయి.. పోయి.. చంద్రబాబు ఎప్పుడైతే టీడీపీ పగ్గాలు చేపట్టాడో… అంతే.. అప్పుడే టీడీపీ పతనం ప్రారంభమైంది. అనుకున్నట్టుగానే టీడీపీ భూస్థాపితం అవడంలో చంద్రబాబు విజయం సాధించాడు. ఆయన వల్లే ఇప్పుడు టీడీపీకి ఈ గతి పట్టింది.

ఇంకా టీడీపీ మీద మీరు ఆశలు పెట్టుకున్నారా? టీడీపీ మీద ఆశలు పెట్టుకోవడం అంటే తామరాకు మీద నీటి బొట్టులాగ. రమణ.. ఇంకా మీరు పదవుల కోసం పాకులాడుతున్నారంటే మీ బుద్ధి ఏంటో తెలంగాణ ప్రజలకు అర్థమయిపోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మీ శక్తి మేరకు గెలుస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లోనే గెలిచే సత్తా లేక మూసుకున్న మీరు మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తారా? అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్నటి దాకా జరిగిన పరిషత్ ఎన్నికల వరకు టీడీపీకి తెలంగాణ ప్రజలు ఏ గతి పట్టించారో అందరికీ తెలుసు. అయినా కూడా మీరు ఇంకా టీడీపీ మీద ఆశలు పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఏం అనాలో తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు.

ఇకనైనా మీరు మేల్కోవాలి రమణ. మీవల్ల ఏం కాదు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మీరు తెలంగాణ ద్రోహులు. అందుకే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఘోరంగా ఓడిస్తున్నారు. ఇంకా బుద్ధి రాకపోగా… పదవులపై ఆశలు పెంచుకుంటున్న మిమ్మల్ని ఏం అనాలి చెప్పు రమణ.

Top