You are here
Home > Latest News > టీ.బీ.జే.పీ కి అర్జంట్ గా నాయకులు కావాలి. ఎలాంటి షరతులు లేవు. కండువాలు రెడీగా ఉన్నాయి.

టీ.బీ.జే.పీ కి అర్జంట్ గా నాయకులు కావాలి. ఎలాంటి షరతులు లేవు. కండువాలు రెడీగా ఉన్నాయి.

Spread the love

లక్ష్మణ్ గారూ,మీరు భ్రమల్లో బతుకుతున్నారేమో అన్న అనుమానం కలుగుతున్నది.మీ మాటలకు,చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు,ఒక వైపేమో 2019 లో గెలిచేది మేమే,అధికారం లోకి వచ్చేది మేమే అంటారు,మరో వైపేమో ఇతర పార్టీల నుండి నాయకుల రాక కొరకు  చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు.ఎట్లాగూ గెలిచే పార్టీకి ఈ వలసల అవసరం ఏమున్నది?అంటే ఇతర పార్టీ ల నుండి నాయకులు వస్తేగాని గెలవలేని పరిస్థితి లో ఉన్నారా?మీ పార్టీ కూడా ఒక మినీ కాంగ్రెస్ పార్టీయే.మీలో మీకు ఐక్యత లేదు.హైదరాబాద్ ను వదిలి రాలేని అశక్తత మీది.ఒంటి చేత్తో పార్టీని గెలిపించే సత్తా గల నాయకులు ఎవరూ కనిపంచడం లేదు.అమిత్ షా కాలికి బలపం కట్టుకుని మూడు రోజులు తిరిగినా కూడా అనుకున్న పని నెరవేరలేదు.కనాకష్టంగా ఒకేఒక్కడు అదీ జెడ్.పీ.టీ.సి. చేరాడు.ఇదీ మీ పార్టీ యొక్క వాస్తవ పరిస్థితి,ఇప్పటికైనా ఆ భ్రమలు,భ్రాంతు ల్లో నుండి బయటకురండి.

మీ పార్టీకే  ఎందుకు ఓటు వేయాలో,ఎందుకు గెలిపించాలో చెప్పగలరా?పోలవరం గ్రామాలను కాకుండా ఏకంగా ఏడు మండలాలను ఎపీకి ఒక చీకటి ఆర్డినెన్స్ ద్వారా అప్పజేప్పినందుకా?హై కోర్టును ఇంకా విభజించనందుకా?రాష్ట్రం ఏర్పడి మూడేళ్ళకు పైగా అవుతున్నా నీటి పంపకాల విషయం లో జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించనందుకా?ఉద్యోగ విభజన,ఆస్తుల విభజన లో జరుగుతున్న అన్యాయం,సాగతీతను,వాటిని పరిష్కరించడం లో మీ నిర్లక్ష్య పూరిత ధోరణి ని చూసి కూడా వోటు ఎలా వేయమంటారు?జాతీయ రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలకు ముడి పెట్టి మాట్లాడకండి.కొత్త రాష్ట్రమైన తెలంగాణ కు మీరు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏమిటి?ఏ ఒక్క ప్రాజెక్టు కైనా జాతీయ హోదా కలిపించే కనీస ప్రయత్నం చేసారా?ఏ ఒక్క ప్రజా సమస్య పై సీరియస్ గా స్పందించని మీకు ప్రజలు ఎలా వోట్లు వేస్తారు,మీ పార్టీలోకి ఎలా వస్తారు?

మొన్నటి అమిత్ షా పర్యటన ద్వారా, తెలంగాణ వాదులకు,ఒక విషయం మాత్రం స్పష్టం అయ్యింది.ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏమాత్రం లేదు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది.నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటె మీ పార్టీ ఆఫీసు ముందు క్యూ లైన్ లు ఉండేవి.జాతీయ స్థాయిలో కూడా మీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.ఎనిమిది శాతం ఉన్న జీ.డీ.పీ.ని చాలా కష్టపడి దాదాపు నాలుగుకు తెచ్చిన ఘనత మీది,పెద్ద నోట్ల రద్దు,జీ.ఎస్.టీ వల్ల దేశం ఆర్థికంగా ఎంత నష్టపోయిందో మీ పార్టీకి చెందినా యశ్వంత్ సిన్హానే హరికథ చెప్పినట్టు చెప్పాడు.కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు,ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి.గుజరాత్ కన్నా మూడేళ్ళు కూడా నిండని తెలంగాణ ఆర్ధిక పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉన్నది అని ఒక ఆంగ్ల పత్రిక రాసింది.మీ పార్టీకి చెందిన నాయకులే టీఆరెస్ నాయకులకు పిలిచి,పిలిచి అవార్డులు,రివార్డులు ఇస్తున్నారు.ఒకరు మిషన్ కాకతీయ సూపర్ అంటాడు,ఇంకో ఆయన మిషన్ భగీరథ అద్భుతం అంటాడు,రైతులకు పెట్టుబడి ఇవ్వడం ఒక చారిత్రిక నిర్ణయం అని మరో ఆయన అంటాడు.పాలక పార్టీకి ఇన్ని సానుకూలతలు ఉండగా,ఇంకా మీకు గెలుపు అవకాశాలు ఎక్కడివి?

Top