You are here
Home > Latest News > డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రశంసించిన కేంద్ర మంత్రి హర్‌దీప్‌పూరి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రశంసించిన కేంద్ర మంత్రి హర్‌దీప్‌పూరి

Spread the love

తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసల జల్లు ….

తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈరోజు కంద్ర మంత్రి హర్‌దీప్‌పూరి గారు సందర్శించారు

ప్రశంసలు కురిపించారు. ఇవాళ న్యూబోయిగూడ ఐడీహెచ్ కాలనీలో కేంద్రమంత్రి హర్‌దీప్‌పూరి పర్యటించి..డబుల్ బెడ్‌రూం ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు చాలా బాగున్నాయన్నారు. అన్ని రాష్ర్టాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల తరహాలో నిర్మాణాలు చేపడతామని హర్‌దీప్‌పూరి అన్నారు. హర్‌దీప్‌పూరితోపాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ కాలనీలో పర్యటించారు.

Top