You are here
Home > Latest News > తుమ్మిడిహెట్టి క‌ల‌సాకార‌మ‌య్యే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది..

తుమ్మిడిహెట్టి క‌ల‌సాకార‌మ‌య్యే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది..

Spread the love

తుమ్మిడిహెట్టి క‌ల‌సాకార‌మ‌య్యే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది..

ఈ ప్రాజెక్టుపై స్ట‌డీ చేస్తున్న ప్ర‌భుత్వం

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం ఆల‌స్య‌మ‌వుతోంద‌ని, రీడైజింగ్ వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతోంద‌ని అటు వెలుగు ప‌త్రిక‌, ఇటు కాంగ్రెస్ నేత‌లు గుండెలు బాదుకుంటున్నారు. వీళ్ల అస‌లు బాధ ప్రాజెక్టు నిర్మాణం ఆల‌స్య‌మ‌వుతున్న‌ది కాదు. ప్రాజెక్టుల వ‌ల్ల కేసీఆర్ ప్ర‌భుత్వానికి మంచి పేరు వ‌స్తోంద‌నే క‌డుపుమంట‌. ఈ ప్రాజెక్టులపై రాష్ట్ర ఇంజనీర్లు స్టడీ చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మించి ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించ‌డానికి కేసీఆర్ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.

ఈ ఆనకట్టను 148 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించడానికి గతంలో మహారాష్ట్ర అంగీకరించినందున అదే స్థాయిలో నిర్మించి నీరిస్తారు. చనాఖా కొరాటా ప్రాజెక్టును కొద్ది నెలల్లో పూర్తి చేసి ఆదిలాబాద్‌ భూములకు నీరివ్వబోతున్నారు. కాంగ్రెస్‌ 50 ఏళ్ల పాలనలో లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో పెడితే తెరాస అధికారంలోకి వచ్చాక కొన‌సాగించింది. ఎవరెన్ని ఆటంకాలు పెట్టినా ప్రాజెక్టుల పనులు ఆగ‌వు. ఎవరెన్ని యాత్ర‌లు చేసినా గోదావరిలో తెలంగాణ వాటా ప్రకారం 1,350 టీఎంసీల జలాలను రాష్ట్రం కోసం వినియోగించుకోక‌త‌ప్ప‌దు. కాంగ్రెస్‌ పాలనలో మహారాష్ట్రతో ఒప్పందం ఏమీ లేకుండానే తుమ్మిడిహెట్టి వద్ద కట్ట నిర్మిస్తామని చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు కాల్వలు తవ్వారు. కానీ తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మన్ను కూడా తవ్వలేదు.

ఆ ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కడితే ఊరుకునేది లేదని అప్పటి మహారాష్ట్ర (కాంగ్రెస్‌) సీఎం ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి చెప్పారు. ఇక్కడా, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ పాలనే ఉన్నా తుమ్మిడిహెట్టిపై ఎందుకు ఒప్పించలేదు? అక్కడ రోజుకు మూడు టీఎంటీసీల నీటి లభ్యత ఉంటే 400 టీఎంసీలు తీసుకురావడానికి ప్రణాళిక వేశారు. దానివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని అప్పుడే తెరాస ఎమ్మెల్యేలు సభలో పేగులు తెగేంతగా ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులోనూ ఇద్దరు ఎంపీలతోనే పోరాడాం. భవిష్యత్‌ తెలంగాణపై సంపూర్ణ అవగాహన ఉన్నందున సాగునీటి ప్రాజెక్టులను ఈ ప్ర‌భుత్వం రీడిజైన్ చేసింది.

Top