You are here
Home > Latest News > తెర తీసింది కాంగ్రెస్.. మరో కుట్రకు!

తెర తీసింది కాంగ్రెస్.. మరో కుట్రకు!

Spread the love
  • – తప్పుడు ప్రచారాలతో ఎన్నికలకు కారణమైన కాంగ్రెస్
  • – ఆ ఎన్నికలను ఇప్పుడు వాయిదా వేయించే కుట్ర
  • – మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు పన్నాగాలు

కాంగ్రెస్ నేతల కుట్ర కోణం మరోసారి బయటపడింది. ఆ పార్టీ దిగజారిన రాజకీయ విలువలు జనం తెలుసుకునేందుకు మరో అవకాశం ఏర్పడింది. ఇప్పటికే హై కోర్టులో పిటిషన్ వేసి భంగపాటుకు గురైన కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను ఎలాగైనా నిలువరించేందుకు కొత్త కుట్ర చేస్తోంది. ముందస్తు ఎన్నికల కోణంలో రాజకీయ కారణాలు ఏవీ కనిపించడం లేదని హై కోర్టు స్పష్టం చేయడంతో… వేరే విషయాన్ని కారణంగా చూపుతూ సుప్రీం తలుపు తట్టేందుకు కుట్రలకు కాంగ్రెస్ పదును పెడుతోంది.

ఓటరు జాబితాను తెరపైకి తెస్తున్న కాంగ్రెస్ పార్టీ… 30 లక్షల ఓట్లు తీసేశారని ఆరోపిస్తోంది. అవును. కరెక్టే. ఏటా చాలా మంది ఓటర్లు వయసు మీద పడడంతోనో, ప్రమాదాల కారణంగానో ప్రాణాలు విడుస్తుంటారు. అలాంటి వారి ఓట్లను కూడా ఇంకా జాబితాలో కొనసాగించాల్సిందేనా? ఆ మాత్రం ఇంగితం కూడా కాంగ్రెస్ కు లేదా? పాత షెడ్యూల్ ప్రకారమే ఓటర్ల జాబితా సవరించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.

కానీ… ప్రభుత్వం లేనపుడు, ఎన్నికల సంఘం కూడా పోలింగ్ ప్రక్రియకు సిద్ధమవుతున్నపుడు… కాంగ్రెస్ ఎందుకిలా చేస్తోంది? వచ్చే ఎన్నికలను అడ్డుకోవడానికి పన్నుతున్న కుట్రగా ఇది అర్థం కావడం లేదా? ఈ విషయం సామాన్యులకు సులువగా అర్థమైపోతోంది. ఎలాగూ గెలిచే సత్తా లేదు కాబట్టి… కోర్టులు, కేసులు అంటూ కాలయాపన చేసేందుకే ప్రతిపక్షం ఇలాంటి చిల్లర వేషాలకు దిగజారుతోందని జనానికి తెలిసిపోతోంది.

అయినా కూడా… హై కోర్టులో పోయిన పరువను… మరోసారి సుప్రీంలోనూ పోగొట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారట. ఓటరు జాబితాను సాకుగా చూసి రేపో ఎల్లుండో పిటిషన్ వేస్తారట. ఇదంతా చూసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే కాదు… టీఆర్ఎస్ నాయకులు కూడా ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కుట్రలను దాటుకుని టీఆర్ఎస్… విజయవంతమైన రాజకీయ పార్టీగా ఎదిగింది.

కాంగ్రెస్ కుట్రల నుంచి తెలంగాణను కాపాడి స్వరాష్ట్రాన్ని టీఆర్ఎస్ సగర్వంగా సాధించింది. సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతోంది. కాబట్టి… ప్రజలు టీఆర్ఎస్ ను కాదని మరో పార్టీని గెలిపించే అవకాశమే లేదు. కేసీఆర్ ను కాదని మరో నేతను ముఖ్యమంత్రిని చేసేది లేదు. కాబట్టి కాంగ్రెస్ నేతలారా… కావాల్సినన్ని కుట్రలు చేసుకోండి. మీ పరువును మీరే మూసీలో కలిపేసుకోండి. జనానికి వచ్చిన నష్టం ఇసుమంత కూడా లేదు.

Top