You are here
Home > Latest News > తెలంగాణకు రెండు అవార్డులు…

తెలంగాణకు రెండు అవార్డులు…

Spread the love

ఇంటియా టుడే అందిస్తున్న స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ 2017 అవార్డుల్లో తెలంగాణ రెండు కెటగిరీల్లో పురస్కారాలు అందుకుంది.

ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ స్వచ్ఛత విభాగాల్లో తెలంగాణకు ఈ అవార్డులు లభించాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీ రామారావు, జోగు రామన్న ఈ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో హర్యాణ, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పాల్గొన్నారు.

వరుసగా మూడు సంవత్సరాలుగా ఇండియాటుడే “స్టేట్ ఆఫ్ ద స్టేట్స్” అవార్డుల్లో తెలంగాణకు అవార్డులు దక్కడం రాష్ట్ర పురోగతికి నిదర్శనం అన్నారు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్… కేసీఆర్ మానస పుత్రిక అయిన పర్యావరణ పరిశుభ్రత విభాగంతో పాటు… పెద్ద రాష్ట్రాల్లో ఆర్ధిక పురోగతిలో కూడా తెలంగాణ మొదటి స్థానం దక్కించుకుంది. పెద్ద రాష్ట్రల్లో ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో కూడా తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ….

భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా ఆర్థికశక్తిగా ఎదుగుతున్నదని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలోకి దూసుకుపోతున్నదని చెప్పారు. తెలంగాణ చిన్నరాష్ట్రం కాదని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే గణనీయంగా వృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు.

Top