You are here
Home > Uncategorized > తెలంగాణ అభివృద్ధిని మంచిని తొక్కి పెట్టాలి ఇదే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడుల సాలు లక్ష్యం .!

తెలంగాణ అభివృద్ధిని మంచిని తొక్కి పెట్టాలి ఇదే సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడుల సాలు లక్ష్యం .!

Spread the love
  • తెలంగాణ ఆకాంక్షలను కప్పిపెడుతున్న దుష్ట పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి
  • మొదటి విడత గొర్రెల పంపిణీ సూపర్ డూపర్ హిట్..
  • కేటీఆర్ ను యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటూ పొగిడిన ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్
  • ఈ పత్రికలకు ఇవన్నీ ఎందుకు పట్టవు..మాకు చోటు లేదా మీ పత్రికల్లో ??
  • కారణం మనవాడు కాదు అన్న ఒక్కటే కారణం
 
గొర్రెల కాపరులను ఆర్థికంగా పటిష్టం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొదటి విడత కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తీసుకోని గొప్ప నిర్ణయం ఇది. మొదటి విడుతలో పంపిణీ చేసిన గొర్రెలకు రూ.1200 కోట్ల విలువైన పిల్లలు పుట్టాయి. 1200 కోట్లంటే మాటలు కాదు. ఇప్పుడు భారతదేశంలోనే ధనవంతులైన యాదవులు అంటే తెలంగాణ యాదికొస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో యాదవులంతా ధనవంతులైపోయారు. భారతదేశంలో ఎక్కువ మాంసం ఎగుమతి చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతున్నది. అంతే కాదు.. గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వెనుకబడ్డ వర్గాల కులవృత్తులకు జీవం పోసేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఏది ఏమైనా.. వాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ ముందున్న లక్ష్యం.
 
ఆదిశగా తెలంగాణలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నా.. తెలంగాణకు శనిలా దాపురించిన దుష్ట పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతికి ఇవన్నీ కనిపించట్లేవు. తెలంగాణ తిండి తిని బతికే ఈ పత్రికలు మదం ఎక్కింది. అందుకే కళ్లు మూసుకుపోయాయి. తిన్నింటి వాసాలు లెక్కబెడుతున్నాయి. తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచులు ఉన్న ఐటీసీ హోటల్ చైర్మన్ దేవేశ్వర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మురిసిపోయారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దూసుకుపోతున్నదని కొనియాడారు. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇన్న పథకాలను ప్రవేశపెట్టలేదని.. నిజంగా ఇది సంచలనమని అభిప్రాయపడ్డారు. మంత్రి కేటీఆర్ ను యంగ్ అండ్ డైనమిగ్ లీడర్ గా అభివర్ణించారు.
 
హైటెక్ సిటీ వద్ద ఐటీసీ నిర్మించిన కోహినూర్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ పైవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. నాలుగేండ్లలో తెలంగాణ ఇంతగా అభివృద్ధి చెందడం గొప్ప విషయం అని అన్నారు. దూరదృష్టితో ప్రారంభించిన అద్భుతమైన పథకాలు, పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు, ఆసరా పింఛన్లు, అందరికీ ఇండ్లు, 24 గంటల కరెంట్.. ఇవన్నీ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
 
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలు ఉన్న ఓ స్టార్ హోటల్ అధిపతి .. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆకర్షితుడినయ్యాని చెప్పినప్పుడు ఈ పత్రికలు దానిపై రాయాలి కదా. ఆ వార్తను ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి.. ఏ పత్రికా కవర్ చేయలేదు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. దానికి సంబంధించిన కవరేజ్ ఏ ఆంధ్రా చానెళ్లలోనూ కనిపించలేదు. ఎందుకు.. ఏం జరుగుతున్నది మీడియాలో. అదే చంద్రబాబు దగ్గినా స్టోరీల మీద స్టోరీలు రాస్తారు.. టీవీల్లో ఇస్తారు. తెలంగాణ ప్రజలే ఏం పాపం చేశారు. మిమ్మల్ని అక్కున చేర్చుకోవడమే వాళ్లు చేసిన నేరమా. తెలంగాణ తిండి తింటూ.. ఆంధ్రా పాలకులకు తొత్తులుగా ఉండటానికి సిగ్గు లేదూ. ఇంకా ఏ మొహం పెట్టుకొని తెలంగాణ నీళ్లు తాగుతూ.. తెలంగాణ ప్రజల మీద పడి సంపాదిస్తూ ఇక్కడ బతుకుతున్నారు. మీరు ఇలాగే ప్రవర్తిస్తే తెలంగాణ ప్రజలు మీ పత్రికలు, చానెళ్లను సహించరు. వాటిని బహిష్కరిస్తారు. అప్పుడు మీరు బట్టలు సర్దుకోవాల్సిందే.
 
 
 
Top