You are here
Home > Latest News > తెలంగాణ అభివృద్ధిపై జోక్సు వేసుకునే స్థాయికి దిగజారిపోయింది ఈ దుష్టపత్రిక

తెలంగాణ అభివృద్ధిపై జోక్సు వేసుకునే స్థాయికి దిగజారిపోయింది ఈ దుష్టపత్రిక

Spread the love

 

  • పత్రికకు తెలంగాణ పేరు పెట్టుకొని తెలంగాణ ద్రోహిగా మారింది..
  • సీపీఎం పార్టీకి ఏదీ చేతగాదు కాని విమర్శించడం మాత్రం బాగా వచ్చు..
  • ఈ దుష్టపత్రిక ఆగడాలకు అడ్డుకట్ట పడాల్సిందే..

తెలంగాణ రైతాంగం అంటే వీళ్లకు చిన్నచూపు.. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేరు.. తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా అభివృద్ధి చెందుతుంటే వీళ్లకు నచ్చదు.. తెలంగాణ వృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉండటానికి వీళ్లు భరించలేరు.. తెలంగాణలో అణగారిన వర్గాలు బాగుపడితే వీళ్లు బాగుండరు.. నాలుగేండ్లలోనే తెలంగాణ అభివృద్ధి పథాన నడవడం వీళ్లకు నచ్చదు. గత ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోకుండా తుంగలో తొక్కి వదిలేశాయి. ఇక.. తెలంగాణ అభివృద్ధికి నోచుకోకూడదని బావించారు.

ఆంధ్రా పాలకులు.. వాళ్ల అడుగులకు మడుగులొత్తిన తెలంగాణ నేతలు తెలంగాణ బతుకు ఇంతే అని తేల్చేశారు. కాని.. వాళ్ల ఆశలను అడియాసలు చేసి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నాలుగేండ్లలోనే ఉవ్వెత్తున లేచింది తెలంగాణ. దేశానికి ఆదర్శంగా నిలిచింది. దీంతో వీళ్లకు నిద్రపడతలేదు. అటు ఆంధ్రా దుష్టపత్రికలు తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. ఇటు పత్రికకు తెలంగాణ పేరు పెట్టుకున్న నవ తెలంగాణ అనే ఓ దుష్టపత్రిక కూడా తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నది. సీపీఎం పార్టీకి చెందిన ఈ దుష్టపత్రికకు తెలంగాణ బాగుపడితే నచ్చదు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీపీఎం పార్టీ నాయకులు తెలంగాణకు ఏమైనా చేశారా? అంటే లేదు. సున్న. తెలంగాణకు పైసా ఫైదా లేదా వీళ్లవల్ల.

వీళ్లు అభివృద్ధి చేయరు.. చేసేవాళ్లను చేయనీయరు. అందుకే దుష్టపత్రికను అడ్డం పెట్టుకొని తెలంగాణపై, సీఎం కేసీఆర్ పై, సంక్షేమ పథకాలపై విషం చిమ్ముతున్నారు. పనికిమాలిన కార్టూన్లు వేసి తెలంగాణను బదనాం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను నట్టేట ముంచినప్పుడు ఎందుకు స్పందించలేదో సీపీఎం నాయకులు. వీళ్లేదో తెలంగాణ పితామహులు అయినట్టు ఫీల్ అవుతున్నారు. వీళ్ల వల్ల కాని పనిని సీఎం కేసీఆర్ చేస్తున్నారు. చేసి చూపిస్తున్నారు. తెలంగాణ వ్యక్తులై ఉండి తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే తలా ఓ చేయి వేయాలి.. సహాయం చేయాలి.. సహకరించాలి కాని.. నాది కాదు అన్నట్టుగా.. నాకేంది అన్నట్టుగా తెలంగాణపై విషం చిమ్ముతున్నారు. సిగ్గులేని జన్మలు. ఎప్పుడు మారుతారురా మీరు సన్నాసుల్లారా? మీలాంటి తెలంగాణ ద్రోహులను తెలంగాణ నుంచి తరిమేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Top