You are here
Home > Latest News > తెలంగాణ ప్రజల గురించి ఆలోచంచడానికి కేసీఆర్ ఉన్నాడు ….

తెలంగాణ ప్రజల గురించి ఆలోచంచడానికి కేసీఆర్ ఉన్నాడు ….

Spread the love

రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదు అన్నట్టు,రాష్ట్రాలు విడిపోయినా వీళ్ళకు ఎంతసేపటికీ తెలంగాణా మీద ఏడుపే.మా సావు మేము సస్తం మా మానాన మమ్మల్ని వదిలేయండిరా నాయనా,అన్నా సిగ్గులేకుండా కంపారిజన్ ఒకటి.పది వేల టీచర్ పోస్టులు చంద్రబాబు ఇచ్చాడట ఇక్కడ కేసీఆర్ ఇవ్వలేదట ,నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాడట.ఏషియా న్యూస్ వాడు తెగ బాధపడిపోతున్నాడు.పదివేల ఉద్యోగాలు ఇచ్చినందుకు చంకలు గుద్దుకుంటున్నాడు,ఇక్కడ కూడా పదివేల కానిస్టేబుళ్ల నియామకాలు జరిగాయి,ఇప్పటివరకు అన్ని శాఖలు కలిపి 26,000 ఉద్యోగాల భర్తీ జరిగింది.మరిన్ని నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయి.సమాజంలో ఉపాధ్యాయులు ఒక భాగం మాత్రమే,మిగతా శాఖలు చాలా ఉన్నాయి.వాటిల్లో కూడా నియామక ప్రక్రియ మొదలయ్యింది.

ముప్పైమూడు వేల ఎకరాల పచ్చని పంట భూములు ,ఏడాదికి మూడు పంటలు తీసే భూములను లాక్కుని,అనధికారికంగా లక్ష ఎకరాలు అని వార్త.లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగాలి అంటే యాభై ఏళ్ళు పడుతుంది,అప్పటివరకు వ్యవసాయ దారుడు ఏం చేయాలి,నష్టపరిహారం రాజధాని నగరంలో కొంత భూమి,అదెప్పుడు పూర్తి కావాలి,తన భూమికి ధర ఎప్పుడు రావాలి,తన వంతు వచ్చేసరికి ఇచ్చినవాడు ఉంటాడా?ఒకవైపు ఆహారభద్రత సమస్య ను ప్రజల నెత్తిన పెట్టి,లక్షల సంఖ్యలో ఉన్న ఉత్పత్తి దారులైన  రైతులను కూలీలను  చేసి,పదివేల ఉద్యోగాలు ఇస్తే సమన్యాయం అయిపోతుందా?పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తే అయిపోయిందా?మిగతా నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి ఇస్తా అని మాటిచ్చి రూపాయి కూడా ఇవ్వలేదు.దాని సంగతి ఎందుకనో ఎత్తరు.

ఆంధ్రప్రదేశ్ కు పది కాదు పదిహేనేళ్ళ పాటు స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ ఇస్తామని వాళ్ళు,తెచ్చి తీరుతామని బాబు ప్రగల్బాలు పలికారు.అది గనక తెచ్చి ఉంటె పెట్టుబడి దారుడు హైదరాబాద్ వంక కన్నెత్తి కూడా చూసేవాడు కాదు,అతి తక్కువ పన్ను,అతి తక్కువ ధరలకు భూమి,అన్నింటిలో రాయితీలు వచ్చేవి ప్రైవేటు కంపెనీలు క్యూ కట్టేవి,వాటి ద్వారా పది వేలు కాదు,పది లక్షల మందికి ఉపాధి లభించేది.విభజన చట్టంలో పొందుపరిచిన హామీనే అది,కేంద్రంలో భాగస్వామ్యం అయి ఉండి కూడా ప్రత్యేక హోదా తేలేని అసమర్థుడు చంద్రబాబు.పోలవరం నిర్మించడం లో విఫలం చెందాడు.ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది.

ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటేనే భూతద్దం లో చూయిస్తున్న ఏషియా న్యూస్,నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో ఏడాదికి పది మంది చోప్పిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఎవరిమీదనైనా చర్యలు తీసుకున్నాడా?పుష్కర మరణాల కారకులకు శిక్ష పడ్డదా?ఇక్కడ కేసీఆర్ కులవ్రుత్తులను ప్రోత్సహిస్తున్నాడు,పశు సంపదను పెంచుతున్నాడు,దశాబ్దాలుగా వెనకబడ్డ వారి జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం జరుగుతున్నది.ప్రత్యామ్నాయ ఆర్ధిక వనరులను సృష్టించే పనిలో ఉన్నాడు.కేవలం చదువుకున్నవాడు మాత్రమే ఉన్నతమైన జీవితం గడపాలా?అన్ స్కిల్డ్ వాళ్ళ సంగతి ఏమిటి,మిషన్ కాకతీయ ఎవరి ఊహకు అందని ప్రతిఫలాలు ఇస్తున్నది.అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి.

Top