You are here
Home > Latest News > తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే బిజెపి ఇలాంటి దుష్ట చర్యలు…

తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే బిజెపి ఇలాంటి దుష్ట చర్యలు…

Spread the love
  • గవర్నర్కు ప్రజాదర్బార్ నిర్వహించి హక్కు ఎక్కడుంది…
  • తానేమీ ప్రజల ద్వారా ఎన్నికైన పాలకురాలు కాదు కదా…
  • తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే బిజెపి ఇలాంటి దుష్ట చర్యలు…
  • చట్టాన్ని దుర్వినియోగం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని తెలుసుకో… బిజెపి…

తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ సమాంతర పాలనను గవర్నర్ ద్వారా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు చట్టబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వం ఉండగా తను కొత్తగా నియమించిన గవర్నర్ తమిళ్ సౌందరరాజన్ ద్వారా ప్రజాదర్బార్ నిర్వహించి సమాంతర పాలనకు శ్రీకారం చుట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయిగత ఐదేళ్లుగా తెలంగాణ ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కొత్తగా ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకోవడంలో అర్థం లేదు. నిజానికి గవర్నర్ పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి మాత్రమే. అది కేవలం రబ్బర్స్టాంప్ అలాంటి పదవి.

క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలిగి ప్రస్తుతం ఏ పని పాట లేని నాయకులను గవర్నర్లుగా కేంద్ర ప్రభుత్వంలోని పార్టీలు పంపిస్తూ ఉంటాయి. అయితే తనకు ఏదైనా సర్వాధికారాలు ఉన్నట్లు భ్రమిస్తున్న గవర్నర్ ఈ ప్రజాదర్బార్ నిర్వహించడం ద్వారా

చట్టవ్యతిరేకమైన సంకేతాలు పంపుతున్నారు.  నిజానికి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ భేషుగ్గా పనిచేస్తూ ఉండగా ఇంకా ఎవరైనా ఇలాంటి ప్రజాదరణ నిర్వహించడంలో అర్థం లేదు. అధికారుల విలువైన సమయాన్ని వృధా చేయడం తప్పించి ఈ దీని ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రజల అభిమానాన్ని చూరగొని రాష్ట్రంలో పాతుకుపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఓడించడం చేతకాకే  బిజెపి చీఫ్​ భ్రమిత్​ షా ఇలాంటి విచిత్రమైన ఎత్తుగడలకు దిగాడు  అని విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ ద్వారా ఇలాంటి ప్రజాదరణ నిర్వహిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకే గవర్నర్ ద్వారా ఇలాంటి చర్యలకు దిగుతున్నారని కేంద్ర ప్రభుత్వం లోని బిజెపి పార్టీ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పటికైనా చట్టబద్దంగా వ్యవహరించాలని, అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దని  విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.

 

 

 

Top