You are here
Home > Latest News > తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల్చి ఏం సాధిస్తావు కోదండ‌రాం..

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కూల్చి ఏం సాధిస్తావు కోదండ‌రాం..

Spread the love

 

వీలైతే తెలంగాణ‌ను బాగు చేస్తా అనే ల‌క్ష్యం పెట్టుకో..

లేదంటే తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వామ్యం అవ్వు..

దిక్కుమాలిన ల‌క్ష్యాల‌తో దిక్కులేకుండా పోతావు జాగ్ర‌త్త‌..

ఈ కోదండ‌రామ్ ఒక‌డు. తుల‌సి వ‌నంలో గంజాయి మొక్క‌లా త‌యార‌య్యాడు. ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్లేవాడు. ఇప్పుడు ఏకంగా ప్ర‌భుత్వాన్నే కూలుస్తాడ‌ట‌. ఇదేం దిక్కుమాలిన ల‌క్ష్యం కోదండ‌రామా?  అస‌లు ప్ర‌భుత్వాన్ని కూల్చి ఏం సాధిస్తావు నువ్వు. నీకు ఒన‌గూరేది ఏమైనా ఉందా.. నువ్వు నిజంగా తెలంగాణ సంక్షేమం కోరుకునేవాడివే అయితే.. తెలంగాణ కోసం అది చేస్తా.. ఇది చేస్తా అని చెబుతావు కాని ఏకంగా ప్ర‌భుత్వాన్నే కూల్చేస్తా అని చెప్ప‌వు. అంటే నీకు తెలంగాణ‌పై ఉన్న‌ది కేవ‌లం స‌వితి త‌ల్లి ప్రేమ అన్న‌మాట‌. నువ్వు తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతావు కోదండ‌రామ్‌. తెలంగాణ స‌మాజం అంతా గ‌మ‌నిస్తున్న‌రు. ఎవ‌రు ఎటువంటి వాళ్లో వాళ్ల‌కు బాగా తెలుసు. నువ్వు చెప్పే క‌ట్టుక‌థ‌లు ఎవ‌రూ విన‌రు.

సీఎం కేసీఆర్ స‌రిగా లేదా?  ఓసారి క్షేత్ర‌స్థాయిలో వెళ్లి రైత‌న్న‌ను అడుగు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌ను అడుగు. ముస‌లివాళ్ల‌ను అడుగు.. ఎవ‌రిని అడిగినా చెబుతారు సీఎం కేసీఆర్ పాల‌న గురించి. గ‌త ప్ర‌భుత్వాలు తెలంగాణ‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. న‌ట్టేట ముంచాయి. ఇప్పుడు నువ్వేమో అభివృద్ధి చేస్తున్న ప్ర‌భుత్వాన్ని అడ్డుకుంటున్నావు. నువ్వ‌స‌లు ప్రొఫెస‌ర్ వేనా.. పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పాల్సిన వ్య‌క్తివే ఇలా దిగ‌జారిపోతే నిన్ను చూసి నేటి యువ‌త‌రం ఏం నేర్చుకుంటుంది చెప్పు.

రాష్ట్రంలో ఉద్యోగాల క‌ల్ప‌న‌కు కేంద్రం నుంచి ల‌క్ష‌ల కోట్లు వ‌చ్చాయా కోదండ‌రాం. నీకు కేంద్రం చెప్పిందా? ఏదీ ఆధారాలు చూపించు. ఊరికో నోటికొచ్చింది మాట్లాడ‌టం కాదు కోదండ‌రాం. ద‌మ్ముంటే నిరూపించు. అప్పుడే తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్ముతారు. మైకు ముందు ఏదో ఒక‌టి వాగి తెలంగాణ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక బావ‌న తీసుకురావాల‌న్న దురుద్దేశంతోనే నువ్వు ఈ బ‌ట్ట కాల్చి మీదేసే ప‌ని పెట్టుకున్నావ‌ని యావ‌త్తు తెలంగాణ స‌మాజానికి తెలుసు. అందుకే.. ఈసారి నిన్ను తెలంగాణ నుంచే లేకుండా త‌రిమి త‌రిమి కొట్ట‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు.

Top