You are here
Home > Latest News > తెలంగాణ లో బీజేపి పప్పులు ఉడకవని ఇకనైనా గ్రహించండి …

తెలంగాణ లో బీజేపి పప్పులు ఉడకవని ఇకనైనా గ్రహించండి …

Spread the love

అబద్ధాల కోర్లు మీరు.. కేసీఆర్ కాదు

ప్రజలకు ఇచ్చిన మాట తీర్చడం కోసం ఎందాకైనా వెళ్లడం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నైజం. అందుకే.. ఆయన సంక్షేమ పథకాల అమలులో దూకుడుగా వ్యవహరిస్తూ.. దేశానికి ఆదర్శప్రాయుడైన ముఖ్యమంత్రిగా అవార్డుల మీద అవార్డులు అందుకుంటున్నారు. ఇది సహించని బీజేపీ నాయకులు.. పనికిమాలిన విషయాలను పట్టుకుని శతవిధాలుగా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే.. హామీల అమలును క్షేత్ర స్థాయిలో అమలు చేస్తూ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచచిపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయాలని బీజేపీ నేతలు కంకణం కట్టుకున్నారు. అయినా.. ప్రజలు వాళ్లను తిరస్కరిస్తూనే ఉన్నారు. ఇంతగా బీజేపీకి జనాదరణ లేకుండా ఉన్నా.. వాళ్లు మాత్రం పగటి కలలు ఆపడం లేదు. కేంద్రంలో టీఆర్ఎస్ చేరే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు.

అసలు ఎవరు అడిగారు.. ఎవరు చెప్పారు… కేంద్రంలో చేరాలన్న ఆరాటంలో కేసీఆర్ ఉన్నారని? ఆ ప్రస్తావనే.. ఆ ముచ్చటే.. కనీసం వాళ్లు చెప్పే వాక్యాల్లో కనీసం ఒక్క పదం కూడా.. టీఆర్ఎస్ నేతల నుంచి రాలేదే.. అయినా ఎందుకిలా బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నదాన్మీద.. ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

పైగా.. నోట్ల రద్దు ప్రక్రియతో.. దేశం దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినా.. ప్రజలు డబ్బుల కోసం క్యూలైన్లలో నిల్చునీ.. నిల్చునీ.. ప్రాణాలు వదిలినా.. బీజేపీ మాత్రం దాని గురించి మాట కూడా మాట్లాడడం లేదు. పైగా.. అది సాధించాం.. ఇది సాధించాం అని దిక్కుమాలిన మాటలతో.. మళ్లీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఒకప్పుడు మోడీని మించిన నాయకుడు.. వాజ్ పేయి కూడా.. ఇలాగే దేశం వెలిగిపోతోంది.. దేశం వెలిగిపోతోంది అంటూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. దేశం ఆయన్ను తిరస్కరించింది. వాజ్ పేయి నాయకత్వాన్ని దేశం సమర్థించినా.. ఆయన పార్టీ చేసిన రాజకీయాలను మాత్రం తిప్పికొట్టింది.

ఇప్పుడు కూడా.. బీజేపీకి అదే తరహా ఫలితం రాబోతోంది. అంతే కాక.. రాష్ట్రంలో ప్రతీ పథకాన్ని తప్పుబడుతున్న కమలం పువ్వు పార్టీ నాయకులకు.. రాష్ట్ర ప్రజానీకం కూడా బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తోంది.

Top