You are here
Home > Latest News > తెలిసి రాస్తారో.. అనిపించింది రాస్తారో.. దుర్మార్గులు!

తెలిసి రాస్తారో.. అనిపించింది రాస్తారో.. దుర్మార్గులు!

Spread the love

ఈ మధ్య కోదండరాం గురించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లపై.. మీడియాలో ప్రముఖంగానే కవరేజీ ఇచ్చారు. సాధారణంగా సీఎం అంతటి వ్యక్తి మాట్లాడారంటే.. ఏ ప్రాంతంలో అయినా.. న్యూస్ పేపర్లలో ఫస్ట్ పేజ్ కవరేజ్ ఖాయం. అందుకు తగ్గట్టే.. విషయం జనాల్లోకి వెళ్లింది. కోదండరాం మరీ ఇంత గలీసోడా.. అన్న చర్చ కూడా జనంలో మొదలైంది.

ఇన్నాళ్లూ పేదల పేరుతో జనాల్లోకి వెళ్తున్న కోదండరాం బండారం ఇదా.. అన్న అభిప్రాయాలూ వినిపించాయి. అవేవీ పట్టని సోషల్ పోస్ట్ అనే పనికిమాలిన ఆన్ లైన్ మీడియా సంస్థ.. తోచిన నాలుగు లైన్లను వార్తగా మార్చేసి.. తప్పుడు కథనాలు వడ్డించేసింది. నమ్ముకున్న మీడియా.. నట్టేట ముంచింది అంటూ.. పస లేని స్టోరీని వండి వార్చింది. ప్రజలతోని ఛీ కొట్టించుకుంటోంది.

అనుకూల మీడియా సంస్థలు కూడా.. కేసీఆర్ కామెంట్లను ఉన్నదున్నట్టుగా పబ్లిష్ చేయడంతో.. కేసీఆర్ కు ఇబ్బంది ఎదురైందంటూ.. ఓ స్టోరీ అల్లేసింది. అది చూసి.. టీఆర్ఎస్ నాయకులే.. ఇబ్బంది పడుతున్నారంటూ చెబుతోంది తప్ప.. ఆ ఇబ్బంది పడుతున్న వాళ్లు ఎవరు అన్న వాస్తవాన్ని.. కనీసం ఇన్ డైరెక్ట్ గా కూడా టచ్ చేయలేకపోయింది. కరెక్టే. మీడియాలో సీక్రెట్ సోర్సులు ఉంటారు. వాళ్లు ఇచ్చే ఉప్పును ఆధారంగా చేసుకుని స్టోరీలు క్రియేట్ చేస్తారు.

కానీ.. మరీ ఇలాంటి విషయంలో కూడా.. టీఆర్ఎస్ నాయకులు బాధ పడుతున్నారు అంటే.. అది నమ్మదగిన విషయం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే.. ముఖ్యమంత్రి ఏనాడూ.. మీడియాలో కవరేజ్ కావాలనో.. కాకూడదనో అనుకుని మాట్లాడరు. ఆయన ఏం చేసినా వార్తే. ఏం మాట్లాడినా వార్తే. కోదండరాంను కేసీఆర్ తిట్టినా వార్తే.. సింగరేణిలో లంచం రూపుదామని పిలుపునిచ్చినా వార్తే.

ఎందుకంటే.. కేసీఆర్ స్థాయి అలాంటిది. తను చేసే సంక్షేమానికి అడ్డు వచ్చేవాళ్లను.. కేసీఆర్ అలాగే తూర్పారబడతారు. జనానికి మంచి చేస్తుంటే.. అడ్డుపడే వాళ్లను అలాగే విమర్శిస్తారు. దాన్ని పబ్లిక్ కూడా.. స్వాగతిస్తూనే ఉంటారు. అందుకు ఉదాహరణే.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. ఎవరెన్ని తప్పుడు మాటలు మాట్లాడినా.. తప్పుడు కూతలు కూసినా పట్టించుకోకుండా.. కార్మికులు టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ ను గెలిపించారు.

అందుకే.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు కాకుండా.. వాస్తవాలను వార్తలుగా రాసే ప్రయత్నం చేస్తే.. సోషల్ పోస్ట్ లాంటి మీడియా సంస్థలకు కాస్తయినా ప్రజల్లో పలుకుబడి దక్కుతుంది.

Top