
నభూతో నభిష్యత్. ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణ… అవి విజయవంతం అయిన తీరు గురించి.. ఈ మాట ఒక్కటి చాలు. గతంలో ఎన్నో సభలు జరిగినా కూడా.. ఇప్పుడు జరిగినవి.. అసలు సిసలైన తెలుగు మహా సభలు అన్న మాట.. సర్వత్రా వినిపించడమే.. సభలు విజయం సాధించాయని చెప్పడానికి ఓ ఉదాహరణ. ఇదే విషయాన్ని సభల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.
సభల విజయవంతం.. తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. తెలుగు మహాసభలు.. మన భాష పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఓ నిదర్శనంగా చెప్పారు. అయితే.. తెలుగును మృతభాష అవుతోందని అంటూ కొందరు ప్రముఖులు సభల సందర్భంగా అనడం.. తనకు బాధగా అనిపించిందని ముఖ్యమంత్రి కాస్త ఆవేదన చెందారు. అయినా.. తెలుగును బతికించుకుంటామని.. తెలుగు ఖ్యాతి చరిత్రలో నిలిచిపోయేలా చేస్తామని స్పష్టం చేశారు.
సభలు, సంబురాలు జరిపి వదిలే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఇకపై.. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో.. తెలంగాణ సాహిత్య అకాడమీ.. ఈ కృషిని కొనసాగిస్తుందని, తెలుగును కాపాడే పనిలో నిమగ్నమై ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పారు. ఇకపై.. ఏటా డిసెంబర్ నెలలో తెలుగు మహాసభలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పి.. తెలుగు వెలుగుకు బాటలు వేశారు.. మన ముఖ్యమంత్రి.
తెలుగు భాషాభివృద్ధికి వేల సూచనలు అందాయని.. అందులోనుంచి ఒకటి రెండూ ఎంపిక చేయడం సరికాదనిపించి.. జనవరిలో మరోసారి భాషావేత్తలతో సదస్సు నిర్వహణకు నిర్ణయించామని ముఖ్యమంత్రి చెప్పారు. అంటే.. తెలుగు మహాసభల సంబురం.. ఇంకా అయిపోలేదని.. తీసుకుంటున్న చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయని ఆయన స్పష్టం చేసినట్టే కదా.
ఇప్పటికే.. రాషట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగును కచ్చితం చేశామన్న ముఖ్యమంత్రి.. ప్రభుత్వం నుంచి సంబంధిత ఆదేశాలు కూడా వెళ్లాయని గుర్తు చేశారు. అదే చిత్తశుద్ధితో.. తెలుగు వెలుగుకు సదా చర్యలు తీసకుంటామని.. ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగంపై.. భాషావేత్తలు.. అభినందనల జల్లు కురిపిస్తూ.. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే.. తెలుగు ఎప్పుడూ బతికే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.