You are here
Home > Latest News > తేల్చుకుందామా రమణా… సవాల్ కు సిద్ధమేనా?

తేల్చుకుందామా రమణా… సవాల్ కు సిద్ధమేనా?

Spread the love

 

  • – ఎన్నికల తర్వాత ఇంటికి ఎవరు వెళ్తారో చూద్దామంటున్న జనాలు
  • – మహా కూటమిని బొంద పెట్టేందుకు సిద్ధమవుతున్న ఓటర్లు
  • – టీడీపీ రమణకు అతి విశ్వాసం పనికి రాదంటూ చురకలు

జన నాయకుడు కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీనే ఏం చేయలేకపోయింది. ఇక టీడీపీ ఎంత.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఎంత. స్థాయికి మించి మాటలు మాట్లాడ్డంలో ఎప్పుడూ ముందుండే రమణ.. ఇప్పుడు మహాకూటమి పొత్తుల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించడం నిజమే కానీ.. ఓడిపోవడం ఖాయమని తెలిసి కూడా ఇంతటి ప్రయత్నాలు చేయడమే ఇక్కడ విచిత్రం. పైగా.. తన సొంత నియోజకవర్గమైన జగిత్యాలను.. మహా కూటమి పొత్తు కోసం కాంగ్రెస్ జీవన్ రెడ్డికి ఇచ్చేయాల్సి రావడంతో ఆయన ఇప్పటికే.. అడ్రస్ గల్లంతు జాబితాలో చేరిపోయారు.

ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయమంటున్న రమణ.. మహాకూటమి విజయం తప్పదని పగటి కలలు కంటున్నారు. సీఎం అబద్ధాలు చెప్పకున్నా.. అవినీతికి పాల్పడకున్నా.. అనవసర ఆరోపణలు చేస్తూ జనంలో దోషిగా మిగిలిపోతున్నాడు. ఎన్నికల ప్రచారానికి నందమూరి వంశాన్ని తీసుకువస్తానని చెబుతున్న రమణ.. ఎవరితో ప్రచారం చేయిస్తాడన్నది మాత్రం చెప్పలేకపోతున్నాడు.

బాలయ్య వస్తే.. ఇక్కడ ఎవరూ దేకరు. ఆయన తొడకొడితే.. తిరిగి ఓటర్లు తమ ఓట్లతో దెబ్బమీద దెబ్బ కొట్టి టీడీపీని మురికి కాల్వలో పడేస్తారు. నందమూరి కుటుంబ పెద్దదిక్కు హరికృష్ణ ఈ మధ్యే కాలం చేశారు. చంద్రబాబు వస్తే జనాలే తరిమికొడతారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాగూ ప్రచారానికి రాడు. మిగిలింది లోకేష్ బాబు. ఆయన గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో జోకుల మీద జోకులు పేలుతున్నాయి.

పైగా.. లోకేష్ చేసిన ప్రసంగాలతో గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా కరువయ్యాయి. ఇక ఎవరున్నారు.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు? రమణా.. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించు. పగటి కలలు మాను. కనీసం నీ రాజకీయ భవిష్యత్తును అయినా కాపాడుకో. కాదూ కూడదంటే.. నీకు రాజకీయంగా జరగబోయే నష్టానికి ఎవరూ బాధ్యులు కారు. గుర్తుంచుకో.

Top