You are here
Home > Latest News > దగ్గరుండి నువ్వే ఖర్చు పెట్టించావా పొన్నం?

దగ్గరుండి నువ్వే ఖర్చు పెట్టించావా పొన్నం?

Spread the love

సిగ్గూ ఎగ్గూ లేని మాటలు ఎవరు మాట్లాడతార్రా బాబూ అంటే.. ఇదిగో నేనూ అన్నాట్ట ఎనకటికొకడు. కరీంనగర్ ప్రజలు ఛీ కొట్టి.. మాకొద్దీ దగుల్బాజీ ఎంపీ అని తిరస్కరించిన పొన్నం ప్రభాకర్ లాంటి మూర్ఖుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టేంత మొనగాడు అయినట్టు ఫీలవుతున్నాడు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని మాట్లాడుతున్నాడు.

గండికోట రహస్యాన్ని బద్ధలు కొట్టినట్టుగా.. తానేదో గొప్పగా మాట్లాడినట్టుగా ఫీలైపోతున్నాడు. కానీ.. లంచాన్ని రూపుమాపుదాం అని కార్మిక లోకంతో ప్రతినబూనించిన కేసీఆర్ తీరును మాత్రం పొన్నం ప్రస్తావించడం లేదు. కోదండరాంపై మాట్లాడిన ముఖ్యమంత్రిని తప్పుబడుతూ అంతెత్తున లేచిన పొన్నం.. దానికి కారణాలు కూడా చెప్పడం లేదు. కోదండరాం కొడుకు.. కాంగ్రెస్ లో క్రియాశీలకం అవుతున్న విషయాన్ని కూడా టచ్ చేయలేదు.

కేవలం.. తన కాంగ్రెస్ ను, తన పరివారాన్ని టార్గెట్ చేస్తున్న తీరును మాత్రమే.. పొన్నం ప్రభాకర్ ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇంత దగుల్బాజీ తనాన్ని చూపెట్టుకుంటున్నాడు కాబట్టే.. ప్రజలు పొన్నం తీరును ముందుగానే గ్రహించారు. ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పారు. అయినా.. తన ఒంట్లో ఉన్న కాంగ్రెస్ రక్తాన్ని వదలని పొన్నం.. తోక వంకరే అని పదే పదే నిరూపించుకుంటున్నాడు.

ఇలా తప్పుడు కూతలు కూస్తున్న పొన్నం ప్రభాకర్ తీరును.. ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని జనమే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు. ఏనుగు ముందు ఏవో మొరిగినట్టుగా.. ముఖ్యమంత్రి గురించి ఇలాంటి వాళ్లు మాట్లాడ్డం కామనే అన్న వాస్తవాన్ని అంతా గ్రహించాలని పిలుపునిస్తున్నారు.

Top