You are here
Home > Latest News > దత్తన్నా.. అనే ముందు ఆలోచించు ఓసారి!

దత్తన్నా.. అనే ముందు ఆలోచించు ఓసారి!

Spread the love

కేంద్ర మంత్రి పదవి పోయిన బాధను.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తూ తీర్చుకునేందుకు బీజేపీ సీనియర్ నాయకుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తెగ ప్రయత్నిస్తున్నారు. మోడీని కేసీఆర్ ఏదో అన్నారని ప్రచారం చేసుకుంటూ.. రాజకీయంగా కూడా లబ్ధి పొందాలని ఆరాటపడుతున్నారు. గతంలో బీజేపీ నేతలు కేసీఆర్ ను, ఆయన కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన విమర్శలను మాత్రం ఆయన పట్టించుకోవడం లేదు.

అందుకే.. మోడీని ఉద్దేశించి చేసిన కామెంట్లకు కేసీఆర్ పశ్చాత్తాపపడాలని కోరుకుంటున్నారు. కానీ.. ఆ చాన్స్ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే..కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది కాబట్టే.. కేసీఆర్ అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆయన మాటలకు ప్రజల నుంచి కూడా మద్దతు ఉంది. కాబట్టి.. దత్తాత్రేయ లాంటి నేతలు.. ఈ విషయంలో అనవసర చర్చలను ఇకపై ఆపితే మంచిది.

అలాగే.. రాష్ట్రం ఏర్పడ్డాక 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న దత్తాత్రేయ.. ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. గత ప్రభుత్వాలు చేసిన పాపాల ఫలితంగానే.. ఆత్మహత్యలు జరిగాయన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉచిత కరెంటు.. పంటకు పెట్టుబడి సహాయం.. సమయానికి ఎరువులు, విత్తనాలు లాంటి చర్యలతో.. సాగు గతంలో కంటే ఎంతో మెరుగైంది.

అందుకే.. రైతులు కూడా కేసీఆర్ కు జై కొడుతున్నారు. అది చూసి తట్టుకోలేకనే.. దత్తాత్రేయ లాంటి వాళ్లు ఇలా నోరు పారేసుకుంటున్నారు.

Top