You are here
Home > Latest News > దత్తన్నా… పడిపోయింది మీ గ్రాఫే..

దత్తన్నా… పడిపోయింది మీ గ్రాఫే..

Spread the love

 

 

  • తెలంగాణలో బీజేపీ అనేది అసలు ఉన్నాదా?
  • ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో బీజేపీ అంటే తెలియని వాళ్లు కోకొల్లలు..
  • అది మీ బీజేపీ పరిస్థితి…

బండారు దత్తాత్రేయ.. సికింద్రాబాద్ ఎంపీవి. ఏదో సిటీలో బీజేపీ ప్రాబల్యం ఉంది కదా అని రాష్ట్రమంతా బీజేపీ పరిస్థితి అలాగే ఉందేమో అని అనుకుంటున్నావా? ఒకసారి తెలంగాణ పల్లెల్లోకి వెళ్లిరా? నీకే తెలుస్తుంది. తెలంగాణ పల్లెల్లో బీజేపీ అంటే తెలియని వాళ్లు కూడా ఉన్నారు. అసలు జనాలకు మీ పార్టీ గురించే తెలియదు. ఇక నీ పార్టీ గెలుస్తుందని.. ఎలా అనుకుంటున్నావు. డిపాజిట్లు కూడా దక్కే స్థితి లేదు. అసలు దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. ప్రధాని మోదీ దేశాన్ని ఏవిధంగా పాలిస్తున్నారో జనమంతా చూస్తున్నారు. ఇక.. మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చి తెలంగాణను అభివృద్ధి చేస్తారంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలేమీ అమాయకులు కాదు. కేంద్రంలో ముందు సరిగ్గా మోదీ పరిపాలిస్తే జనాలు బీజేపీని నమ్మేవారు కాని.. నమ్మిన వాళ్లను నట్టేట ముంచాడు మీ మోదీ. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ జనాలను మభ్యపెడదామని చూస్తున్నారు.

తెలంగాణ బీజేపీ నాయకులే పగటి కలలు కనేది దత్తాత్రేయ. భయాందోళనకు గురవుతున్నదే బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రిగా ఉన్న నిన్ను మంత్రి పదవి నుంచి ఎందుకు మోదీ ఊడబీకాడో తెలంగాణ జనాలకు తెల్వదనుకుంటున్నావా దత్తన్న. తెలంగాణ బీజేపీ నాయకులతో ఏదీ కాదని మోదీకి తెలుసు. అందుకే మీ ఖేల్ ఖతం అయింది. కేబినేట్ లో మీలో ఒక్కరికైనా స్థానం కల్పించాడా మీ మోదీ. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీ స్థానం ఏంటో.. తెలంగాణలో బీజేపీ స్థానం ఏంటో.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేకపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పనికిమాలిన ఆయుష్మాన్ భవ అంటూ అటూ ఇటూ కాని పథకాన్ని ప్రవేశపెట్టింది. అది పేదలకు అందని ద్రాక్షే. ఏదీ సరిగ్గా చేయలేని మీ బీజేపీ నాయకులా తెలంగాణ ప్రభుత్వాన్ని నిందించేది. తెలంగాణలో మీ స్థానం ఎక్కడో తెలుసుకొని మాట్లాడండి దత్తాత్రేయ. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నువ్వు ఇలా మాట్లాడుతున్నవంటే అధికారం కోసం ఎంత దిగజారిపోతున్నావో అర్థమవుతూనే ఉన్నది.

Top