You are here
Home > Latest News > దరిద్రులారా.. చీమ కుట్టినా ప్రభుత్వానిదే తప్పంటారా?

దరిద్రులారా.. చీమ కుట్టినా ప్రభుత్వానిదే తప్పంటారా?

Spread the love

తాడ్వాయి అడవుల్లో గొత్తి కోయలపై అటవీ అధికారులు దాడి చేయడాన్ని రాజకీయం చేసేందుకు టీడీపీ నాయకులు దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన వెనక ప్రభత్వం కుట్ర ఉందని.. ముఖ్యమంత్రే ఈ దాడి చేయించారని తప్పుడు కూతలు కూస్తున్నారు. బాధిత గొత్తికోయలను తమ ఆఫీసుకు పిలిపించుకుని.. వాళ్లే తమ దగ్గరికి వచ్చి మాట్లాడారని తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు.

నిజంగా.. తమకు అన్యాయం జరిగే.. తాడ్వాయి నుంచి హైదరాబాద్ వరకూ వచ్చి మాట్లాడి ఫిర్యాదు చేసి వెళ్తారా? ఇది నమ్మాలా? ఒక్క రోజు కష్టపడకుంటే.. ఇబ్బంది పడే జీవితాలు పాపం గొత్తి కోయలవి. గత ప్రభుత్వాలు చేసిన దోఖా కారణంగా వాళ్ల బతుకులు అలా ఏడ్చాయి. అలాంటివాళ్లపై.. పోలీసులు దాడి చేసిన సంఘటన గురించి.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది.

వాస్తవాలు తెలుసుకునే పనిలో ఉన్న ప్రభుత్వం.. దాడికి కారణమైన పోలీసులు ఎవరన్నది గుర్తించి కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో కూడా.. ఇలాగే జరిగినపుడు సంఘటనకు కారణమైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించింది. ఇప్పుడు.. తాడ్వాయి ఘటనలోనూ అదే పని చేస్తోంది. అంతే తప్ప.. పోలీసులను పెట్టించి.. జనాన్ని కొట్టించేంత స్థాయికి ప్రభుత్వం ఎన్నడూ దిగజారలేదు.

ఓ సారి బషీర్ బాగ్ ఘటనను గుర్తు చేసుకుంటే.. టీడీపీ నేతలు ఇలా మాట్లాడరు. విద్యుత్ చార్జీల పెంపు వద్దు అని ఆందోళన చేసిన అమాయక జనాలను గుర్రాలతో తొక్కించి.. పోలీసు తూటాలతో చంపేయించి.. అందరూ చూస్తుండగానే హత్య చేసిన హంతక పార్టీ టీడీపీ.. ఇప్పుడు టీఆర్ఎస్ ను విమర్శించే ధైర్యం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఎలా తిప్పికొట్టాలో జనాలే చూసుకుంటారు. ఎందుకంటే.. టీడీపీ సంగతి వాళ్లకు బాగా తెలుసు.

Top