You are here
Home > Latest News > దామోదరయ్యా.. అవినీతి గురించి మీరే చెప్పాలయ్యా!

దామోదరయ్యా.. అవినీతి గురించి మీరే చెప్పాలయ్యా!

Spread the love

అబ్బబ్బా.. ఎన్నాళ్లయ్యింది రాంరెడ్డి దామోదర్ రెడ్డి పలుకులు విని. చాలా రోజులైనట్టుంది.. మీడియా ముందుకొచ్చి.. మళ్లీ తన పార్టీకే అలవాటైన పనికిమాలిన భాషణాలను వాడుతూ.. ముఖ్యమంత్రిపై బురద చల్లుతూ.. దామోదర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తనేదో గొప్పగా మాట్లాడుతున్నట్టు ఫీలైపోయి.. సీఎం కేసీఆర్ మాటతీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అవినీతిని మర్చిపోయి.. ఇప్పటి ప్రభుత్వాన్ని తిట్టిపోశారు.

అంతే కాదు.. తన పార్టీ నాయకులేదో సుద్దపూసలా మాట్లాడినట్టు రాంరెడ్డి ఫీలయిపోతున్నాడు కానీ.. గతంలో హైదరాబాద్ వెళ్లాలంటే పాస్ పోర్టు అవసరమవుతుందేమో అని మాట్లాడిన రాజశేఖరరెడ్డి గురించి ఒక్క మాట కూడా.. రాంరెడ్డి గుర్తుకు చేసుకోలేదు. అలాగే.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు.. అంటూ అసెంబ్లీ సాక్షిగా బెదిరించిన కిరణ్ కుమార్ రెడ్డి గురించి కూడా మాట్లాడలేదు.

తెలంగాణను అడ్డుకున్న తన పార్టీ నాయకులు, కేడర్ గురించి మాట్లాడలేదు. అలాంటి రాంరెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడేంత మొనగాడయ్యాడా? మీడియా ముందు అంటే సరే కానీ.. జనం ముందు ఇలాంటి మాటలు వద్దు రాంరెడ్డి. తరిమి తరిమి కొడతారు. ఒక్కసారి.. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలు చూడు. జనాల్లో కలిసి పోతున్న సీఎం వ్యవహార శైలిని చూడు.

ముఖ్యమంత్రి అంటే.. కాంగ్రెస్ నాయకుల్లా ఉండాలని కాదు. జనంలో కలిసిపోయే నేతగా ఉండాలని కేసీఆర్ నిరూపిస్తున్నారు. అలాగే.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే మాత్రమే కావొచ్చు. కానీ.. దాన్ని సాధించింది మాత్రం కేసీఆర్ అన్న విషయాన్ని మాత్రం మరవొద్దని ప్రజలు రాంరెడ్డికి గుర్తు చేస్తున్నారు. నోరు జారేముందు.. ఓ సారి ఆలోచించుకోవాలని కూడా హితవు పలుకుతున్నారు.

Top