You are here
Home > Latest News > దాసోజూ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పూ!

దాసోజూ.. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పూ!

Spread the love

 

ఏంటీ.. సంతలో పశువులను కొన్నట్టు.. ఇతర పార్టీల నాయకులను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారా? ఆ విషయాన్ని రాద్ధాంతం చేస్తూ.. లేఖ రాస్తూ.. నువ్వు పనికిమాలినోడివని మరోసారి నిరూపించుకుంటావా? సరే నీ ఇష్టం. నీకు ఎలా ఇష్టం ఉంటే.. అలా జనంతో పిలిపించుకో. కానీ.. నోరు జారి తప్పుడు ఆరోపణలు మాత్రం చేయకు దాసోజు శ్రవణ్. నువ్వు చేసిన కామెంట్లకు సంబంధించే.. కొన్ని ప్రశ్నలు అడుగుతాం.. జవాబులు చెప్పు.

సాగును బాగు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసే రైతు సమన్వయ సమితులను అడ్డుకుంటున్న మీ తీరుకు కారణమేంటి? రైతులు వద్దు.. అనకున్నా.. మీరు ఈ చర్యను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇది రైతులకు చేసే ద్రోహంగా మీకు కనిపించడం లేదా?

టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చారని అంటున్న మీకు.. టీఆర్ఎస్ కార్యకర్తల్లో రైతులకు ప్రాధాన్యం ఇచ్చి.. కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరు కనిపించడం లేదా?

రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అంటున్నారే.. తగ్గిన ఆత్మహత్యలు ఎందుకు మీకు కనబడవు? మీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిన దాష్టీకాల ఫలితమే.. అన్నదాతల గోస అన్నది మీకు తెలియదా.. లేక తెలిసే నటిస్తున్నారా?

రైతులను పరామర్శించే తీరిక ఓపిక అని మాట్లాడుతున్నారే.. రైతుల కోసం పంట పెట్టుబడి సహాయం అందిస్తుండడం.. అలాగే విత్తనాలు, ఎరువులకు గతంలో మాదిరిగా క్యూలైన్లు లేకుండా పద్ధతిగా ప్రక్రియ పూర్తి చేయడం మీకు కనిపించడం లేదా?

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ స్థాయి.. అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు అందుతుంటే.. మీ మెదడుకు ఎక్కడం లేదా?

ఎందుకు ఇన్ని కుట్రలు? ఎందుకు పదే పదే ఇన్ని తప్పులు? ఒక్క మాట చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండడం.. మంచిని చేయడం నచ్చడం లేదని. ఆ తర్వాత సంగతి ప్రజలే తేలుస్తారు.

Top