You are here
Home > Latest News > దేశం కోసం ఇన్నేళ్లు ఎందుకు ఒకటవ్వలేదు..

దేశం కోసం ఇన్నేళ్లు ఎందుకు ఒకటవ్వలేదు..

Spread the love

 

  • నువ్వు తిట్టి పోస్తున్న ఆ మోదీతోనే ఇన్నేళ్లు కలిసి తిరిగావు కదా బాబు..
  • తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన నువ్వు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నావు..
  • నీ అంత కన్నింగ్ ఫెలో ఎవ్వడూ ఉండడు బాబు..

కన్నింగ్ కే అమ్మ మొగుడు చంద్రబాబు. కన్నింగ్ అంటే ఎలా ఉంటుందో చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చు. ఈయనట దేశం కోసం కాంగ్రెస్ తో కలిశాడట. దేశం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు చంద్రబాబు. ఇన్నేళ్లు గుర్తుకురాలేదా? ఇన్నేళ్లు దేశం పచ్చగా ఉండెనా? ఇన్నేళ్లు మంచిగుండి.. ఇప్పుడే దేశం నాశనమయిందా? సిగ్గు లేకుండా దేశం కోసమే ఒక్కటయ్యామని ఎలా చెబుతున్నావు నువ్వు.

ఏ పార్టీ అంతం కోసమైతే టీడీపీ పుట్టిందో అదే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టడం దేనికి సంకేతం. సిగ్గు లేకుండా కాంగ్రెస్ తో జతకట్టి ఏమొహం పెట్టుకొని తెలంగాణ ప్రజలను ఓట్లడుగుతున్నావు బాబు. అక్కడ ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంటే నీకు ఆనందంగా ఉందా? కాంగ్రెస్, టీడీపీ జెండా కలిసి ఉంటే నీకు సంతోషంగా ఉందా బాబు. ఛీ.. ఛీ.. నువ్వసలు మనిషివేనా? అధికారం, డబ్బు కోసం ఏమైనా చేస్తావా? అంటూ తెలంగాణ జనాలు కూడా నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అయినా బుద్ధి మారదే?

కుక్క తోక వంకర అన్నట్టుగా.. చంద్రబాబు బుద్ధి కూడా అంతే. ఆ బుద్ధి మారదు. వంకర బుద్ధి. కన్నింగ్ ఫెలో. అందుకే కదా.. సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. ఇప్పుడు రెండో వెన్నుపోటు పొడిచి తెలంగాణను ఢిల్లీకి లేదంటే అమరావతికి గులాంగిరీ చేసేలా చేద్దామనుకుంటున్నావా బాబు. బాబూ.. చంద్రబాబు నీ పప్పులు ఇక ఉడకవు. తెలంగాణలో నీ ఖేల్ ఖతమయింది. నీ టీడీపీ పార్టీ తెలంగాణలో జాడ పత్తా లేకుండా పోయిందని కూటమి అంటూ తెగ ఆరాటపడుతున్నవు. ఆ కూటమి కూడా త్వరలోనే మట్టికట్టుకుపోతుంది. అప్పుడు ఏం చేస్తవు. నువ్వు నీ కూటమిని మూసీలో కలిపేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నరు. తర్వాత నువ్వు, రాహుల్ గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ కోదండరాం, ఇంకా మిగిలిన నేతలంతా ఢిల్లీకి పోయి చెమ్మచెక్క ఆటాడుకోండి. అదే మీకు కరెక్ట్.

Top