You are here
Home > Latest News > దొంగే దొంగా అని అన్నాడట అట్లనే ఉంది కోమటిరెడ్డి ముచ్చట ..!!

దొంగే దొంగా అని అన్నాడట అట్లనే ఉంది కోమటిరెడ్డి ముచ్చట ..!!

Spread the love
  • బీసీలకు కాంగ్రెస్ పార్టీలో సరైన ప్రాధాన్యం లేదనగానే..
  • యూటర్న్ తీసుకొని దానంపై ఎదురుదాడికి దిగిన కోమటిరెడ్డి
  • సీనియర్ నేతకే చుక్కలు చూపిస్తున్నారు..
  • బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నిరూపించాలి..
  • బీసీల్లోని అన్ని కులాలు, వర్గాల వారికి పథకాలు ప్రవేశపెట్టిన ఘటన సీఎం కేసీఆర్ ది..

“కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతున్నది. బలహీన వర్గాలను పార్టీలో అణచివేస్తున్నారు. వాళ్లకు సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఒకే వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీలో అధికారం, ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలన్నీ నా వద్ద ఉన్నాయి.. “ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. దాదాపు 30 ఏండ్లు కాంగ్రెస్ పార్టీతో పని చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్.

ఇక చెప్పండి.. కాంగ్రెస్ పార్టీతో అన్ని సంవత్సరాలు అనుబంధం పెంచుకొని ప్రత్యక్షంగా చూసి దానం చెబుతున్న మాటలు అవి. వేరే పార్టీ వాళ్లు చెబితే కొంచెం ఏదైనా సందేహం ఉండేదేమో కాని.. సాక్షాత్తూ దానం కాంగ్రెస్ పార్టీ లొసుగులను బయటపెట్టడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. అందుకే దానంపై ఒక్కసారిగా ఎదురుదాడికి దిగారు.

దానంపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. దానంపై వ్యక్తిగతంగా దాడికి దిగాడే తప్ప.. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలపై మాత్రం నోరు విప్పలేదు. అంటే.. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. దానంను అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీపై కోమటిరెడ్డి పరోక్ష దాడికి దిగడం మాత్రం విడ్డూరం. 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేయలేని పనులకు 4 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ, గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ వంటి పథకాలను ప్రవేశపెట్టి బీసీలను ఉన్నత స్థానంలో నిలబెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పతనానికి ఆకర్షితుడై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు దానం నాగేందరే ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావట్లేదు. ఎన్నికలు సమీపిస్తుండటం, వాళ్ల బాగోతాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవట్లేదు వాళ్లకు.

 

Top