You are here
Home > Latest News > దోపిడీదారుల నోట.. సత్తెపూస మాటలు!

దోపిడీదారుల నోట.. సత్తెపూస మాటలు!

Spread the love

 

  • రాహుల్ తో సభ పెట్టిస్తారట
  • ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు రాహుల్ వస్తారని.. ఏమైంది?
  • అవాస్తవాలు మాట్లాడితే నిజాలు అవుతాయా?
  • పనికిమాలిన ఆరోపణలతో పరువు పోగొట్టుకుంటున్న కాంగ్రెస్

కాంగ్రెస్ నేతలకు చేజేతులా పరువు పోగొట్టుకోవడం అలవాటైపోయింది. వారి ఖర్మకు మనం ఏం చేస్తాంలే అని అనుకుంటూ ప్రజలు కూడా ఈసడించుకుంటున్నా.. ఆ విషయం కాంగ్రెస్ నేతలకూ అర్థమవుతున్నా.. ఆఖరికి ఆ పార్టీ శ్రేణులు కూడా తమ నేతల తీరుకు నెత్తీ నోరూ బాదుకుంటున్నా.. పరిస్థితిలో ఎంత మాత్రం కూడా మార్పు కనిపించడం లేదు. అప్పుడెప్పుడో నేరెళ్లలో ఇసుక మాఫియా అంటూ శవ రాజకీయం చేసిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని రాజకీయం చేసేందుకు యత్నిస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు విఫలమై.. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను కూడా రప్పించి అభాసుపాలైన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా రప్పిస్తామంటూ గప్పాలు కొడుతున్నారు. ఈ పనికి వాళ్ల నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డే నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి చాలాసార్లు రాహుల్ తో సభలు నిర్వహిస్తామని చెప్పి.. ఆఖరికి చేతులు కాల్చుకున్న ఆ దుర్మార్గులు.. ఇప్పుడు మరోసారి అదే పాట పాడుతుండడం హాస్యాస్పదమవుతోంది. కాంగ్రెస్ నేతల తీరును చూసి రాష్ట్ర ప్రజలు మరోసారి నవ్వుకోవాల్సి వస్తోంది.

అంతే కాదు.. పనిలో పనిగా.. మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి కూడా మరోసారి అవినీతి ఆరోపణలు చేశాడు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన్ను ఒక్కటే అడగదలుచుకున్నాం. అది కూడా ప్రజల తరఫున అడగదలుచుకున్నాం. కల్వకుంట్ల కుటుంబం కోట్లు దోస్తున్నదని అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డీ.. నీకు దమ్ముంటే ప్రజా క్షేత్రంలోకి రా. కల్వకుంట్ల కుటుంబాన్ని దోషిగా నిరూపించు. అప్పటివరకూ నోరు మూసుకుని ఉండు.

ఆధారాలు లేని ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారని అనుకుంటే.. అంతకంటే పొరపాటు మరోటి ఉండదని గుర్తుంచుకోండి కాంగ్రెస్ నేతలారా. చేజేతులా మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్నారు. ఇప్పటికీ అలాగే వ్యవహరిస్తామని మొండికేస్తే.. మీ ఖర్మకు ఎవరూ బాధ్యులు కారన్న వాస్తవాన్ని కూడా గ్రహించండి.

Top