You are here
Home > Latest News > దోపిడీపై ఆధారాలు చూపించు రేవంత్ రెడ్డీ!

దోపిడీపై ఆధారాలు చూపించు రేవంత్ రెడ్డీ!

Spread the love

రేవంత్ రెడ్డీ.. నీలాగా డబ్బుల కోసం పక్కలు పరిచే రకం అనుకున్నావా టీఆర్ఎస్ నేతలంటే? నీలాగా ఓటుకు ఐదు కోట్లు పెట్టి కొనడం అనుకున్నావా పరిపాలన అంటే? నీకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా.. నీలాగా పనులు చేసేవాళ్లు ఉన్నారనుకుంటే.. అది పొరబాటే. అయినా.. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగనే కనిపిస్తుందట. నీ కథ కూడా అలాగే ఉంది.

ఇంకా బ్రోకర్ పనులు మానలేదనుకుంటా.. అందుకే.. ఇలా అడ్డగోలుగా ఆధారాలు లేని ఆరోపణలు చేసతూ.. అడ్డంగా బుక్కైపోతున్నావు. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆరోపణలు చేస్తూ.. జనాల్లో నవ్వులపాలైపోతున్నావు. జనం కోసం.. రవాణా సౌకర్యాల మెరుగు కోసం.. హైదరాబాద్ ను విశ్వనగరం చేయడం కోసం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పరితపిస్తుంటే.. దాన్ని అర్థం చేసుకోకుండా.. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. సంక్షేమ కంటకుడిగా మారిపోతున్నావు.

రాజకీయ నాయకుడిగా బతికున్నంత కాలం.. నీ దోపిడీ మాటలు ఆగవని జనం అర్థం చేసుకుంటున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పుడు.. మొహం చాటేసుకుంటూ వెళ్లిపోయావు. ఇప్పుడు మాత్రం.. ధైర్యంగా.. బరితెగించి మరొకరిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నావు. అలాంటి నీకు.. సమాజంలో రాజకీయాలు చేసే అర్హతే లేదని జనం తేల్చి చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో నిన్ను శాశ్వతంగా ఇంటికి పంపించి.. తగిన బుద్ధి చెప్పేందుకూ సిద్ధమవుతున్నారు.

Top