You are here
Home > Latest News > ధరణి.. దేశానికే దిక్సూచి కాబోతోంది!

ధరణి.. దేశానికే దిక్సూచి కాబోతోంది!

Spread the love

గ్రామాల్లో రైతుల భూముల రికార్డులను ప్రక్షాళన చేయడంలో విజయవంతమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ రికార్డుల ప్రక్షాళనపై పక్కా ఆధారాలతో మరోసారి జనంలోకి వెళ్లబోతోంది. ఏ రాష్ట్రం ఊహించని విధంగా.. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా.. పక్కా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తూ.. మరోసారి యావత్ భారతానికి ఆదర్శంగా నిలవబోతోంది. ఇన్నాళ్లూ సర్వేను పక్కాగా పూర్తి చేసిన ప్రభుత్వం.. ఇకపై.. రైతులకు కొత్త రికార్డులతో కూడిన పాస్ పుస్తకాలను అందించేందుకు సిద్ధమైంది.

భూ వివరాలతో కూడిన పట్టా పాస్ పుస్తకాలను ప్రింట్ చేస్తున్నామని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.. సర్కార్ చిత్తశుద్ధిని చాటుతోంది. కోర్ బ్యాంకింగ్ తరహాలో ధరణి పేరుతో ల్యాండ్ వెబ్ సైట్ నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి.. అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. అన్ని గ్రామాల్లో.. మార్చి 11నే రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ మహత్ కార్యానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కానీ.. ప్రధాని మోడీని కానీ ఆహ్వానించనున్నట్టు తెలిపారు.. సీఎం కేసీఆర్.

భూ సర్వే తో ఎవరి భూమి ఎవరిదో సులువుగా తేలిపోయిందని.. ఈ వివరాలన్నీ ధరణి వెబ్ సైట్ లో ఉంటాయని సీఎం చెప్పారు. మార్చి 11 నుంచి జరిగే భూ క్రయ విక్రయాలు.. లాండ్ రిజిస్ట్రేషన్లలో ధరణి వెబ్ సైట్ కీలకం కాబోతోందని చెప్పారు. దీంతో… ధరణి వెబ్ సైట్ లో ఉన్న వివరాలు సరి చూసుకుని.. కొనుక్కునే అవకాశం ప్రజలకు కలగబోతోంది. అంతే కాదు.. కోర్టు కేసులు ఇతరత్రా సమస్యలు ఉన్న భూముల వ్యవహారాలను కూడా త్వరలో పరిష్కరిస్తామని సీఎం చెప్పడంతో.. భూ కొనుగోలుదారుల సమస్యలు ఆ రకంగా కూడా తీరబోతున్నాయి.

భూములు కొని.. భవిష్యత్తులో ఇబ్బంది పడడం లాంటి సందర్భాలు తగ్గిపోనున్నాయి. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ముఖ్యమంత్రి పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ లా.. భూ ప్రక్షాళన చేస్తే.. అది దేశానికి మంచిదంటూ.. తాజా చర్యలను స్వాగతిస్తున్నారు.

Top