You are here
Home > Latest News > నంది ఎల్లయ్య గారు మీరు వాస్తవాలు మరచి మాట్లాడుతున్నారు .

నంది ఎల్లయ్య గారు మీరు వాస్తవాలు మరచి మాట్లాడుతున్నారు .

Spread the love

 

  • నువ్వు నిరంతరం పేదల కోసం పనిచేస్తున్నవా?
  • 6 సార్లు ఎంపీ అయ్యావు..నువ్వెందుకు తీసుకురాలేకపోయావు రైల్వే లైను..
  • గెలిచిన దగ్గర నుంచి నీ నియోజకవర్గంలో పట్టుపని పది సార్లు కూడా పర్యటించలేదు.

నంది ఎల్లయ్య జోకుల మీద జోకులేసిండు. అందుకే కాసేపు నవ్వుకొని అప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి. అంతే కదా. నంది ఎల్లయ్య.. సాదాసీదా నాయకుడేం కాదు. 6 సార్ల ఎంపీగ గెలిచిండు. సిద్దిపేట ఎంపీగా ఐదు సార్లు చేసిండు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నడు. అయితే.. నంది ఎల్లయ్యను అడిగేది ఒకటే ప్రశ్న. ఏంటంటే.. ఇన్నేండ్ల నీ రాజకీయ జీవితంలో ఎందుకు మాచర్ల – గద్వాల రైల్వేలైనును తెప్పించలేకపోయావు. నువ్వు నిరంతరం పేదల కోసమే పనిచేస్తా అని అంటున్నవు కాబట్టి మరో ప్రశ్న.

గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలంలో ఉన్న అమరవాయి అనే గ్రామం గుర్తుందా నీకు. అరెరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అంటావా? ఆ ఊరును నువ్వు దత్తత తీసుకున్నావు. మరి.. ఆ ఊరు ఇప్పుడు ఎట్లుందో తెలుసా? ఎంపీ దత్తత తీసుకున్నాడు కదా.. ఇక ఆ ఊరు అభివృద్ధి మామూలుగా ఉండదు అని జనాలు అనుకున్నారు. కాని.. నువ్వు ఆ ఊరును పట్టించుకోవడమే మానేశావు. మరి.. ఏది నువ్వు చేసిన సేవ.

అసలు.. నువ్వు గెలిచిన నీ నియోజకవర్గంలోనే ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారు. గెలిచిన తర్వాత ఒక్కసారన్నా వాళ్లకు నీ ముఖం చూపించావా? ఒక ఎంపీగా రైల్వే లైన్ కోసం నువ్వు చేసిందేమీ లేదు. శూన్యం. ఓ ఎంపీ అయి ఉండి చేతులు కట్టుకొని కూర్చొని.. అభివృద్ధి చేస్తున్న వాళ్ల మీద అభాండాలు వేస్తున్నావున. నీకేమైనా న్యాయమా ఇది. ఇన్నేండ్ల నీ రాజకీయ జీవితంలో నువ్వు చేయలేని అభివృద్ధిని కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిస్తున్నది. నీకు చేతకానప్పుడు కనీసం నీ నియోజకవర్గాన్నిఅభివృద్ధి చేస్తున్నవారికైనా సహకరించు. ఎలాగూ నాగర్ కర్నూలు ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.

 

Top