You are here
Home > Latest News > నమ్మారు కాబట్టే వస్తున్నారు.. సంక్షేమంలో భాగమవుతున్నారు!

నమ్మారు కాబట్టే వస్తున్నారు.. సంక్షేమంలో భాగమవుతున్నారు!

Spread the love
  • టీఆర్ఎస్ గూటికి దామోదర్ రెడ్డి, కిష్టారెడ్డి, అబ్రహాం
  • వందలాది అనుచరులతో పార్టీలో చేరిన నేతలు
  • కేసీఆర్ పాలనపై నమ్మకంతోనే పార్టీ మార్పు

కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను అవినీతి మరక అంటకుండా ఖర్చు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి పార్టీలకు అతీతంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే.. ముఖ్యమంత్రి పనితీరుకు ఆకర్షితులపై చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరగా.. తాజాగా కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, అబ్రహాం.. గులాబీ కండువా కప్పుకొన్నారు. వారితో పాటు.. అనుచరగణానికి కూడా టీఆర్ఎస్ సభ్యత్వాన్ని ఇప్పించారు.

2004 నుంచి 2014 వరకు మాత్రమే కాదు. అంతకు ముందు కూడా తెలంగాణను కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు మాత్రమే వాడుకుంది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించి.. కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలతో కళ్లు తెరిచిన వీళ్లంతా.. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం కాబోతున్నారు. అధికార పక్షంలో ఉన్నపుడు తెలంగాణ సంక్షేమానికి ఏమీ చేయలేకపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా అదే దుర్మార్గపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్న తీరును.. దామోదర్ రెడ్డి, కిష్టారెడ్డి, అబ్రహాం గుర్తించారు.

అందుకే.. తాము మాత్రమే గులాబీ గూటికి చేరకుండా.. తమ అనుచరులనూ టీఆర్ఎస్ లో చేర్పించారు. తమ నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు అభివృద్ధిపై, సంక్షేమంపై భరోసా కల్పించారు. దీంతో.. ఆయా ప్రాంతాల ప్రజలు కూడా ఈ చేరికలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ వల్ల తమకు ఒరిగిందేమీ లేదని.. నాలుగేళ్లుగా కేసీఆర్ పరిపాలనతో సంక్షేమాన్ని అద్భుతంగా అనుభవిస్తూ హాయిగా జీవిస్తున్నామని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. జై కేసీఆర్ అని నినదిస్తున్నారు.

దామోదర్ రెడ్డి, కిష్టారెడ్డి, అబ్రహాం మాదిరే.. ఇతర పార్టీల నేతలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని.. రాజకీయ పునరేకీకరణతో మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ నే సీఎం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

Top