You are here
Home > Latest News > నల్లికుంట్ల చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు.

నల్లికుంట్ల చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు.

Spread the love

 

  • పాలమూరు ఎత్తిపోతల విషయంలో మొట్టికాయలు తిన్నది బాబుకు సరిపోలే.
  • ఇప్పుడీ నీచుడి కన్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పడింది.
  • ప్రాజెక్ట్ పనులు ఆపేయాలంటూ కేంద్రానికి లేఖ రాసిండు ఈ నీచ, నికృష్టుడు.
  • చంద్రబాబుకు చిరతలు కొట్టే రాష్ట్ర టీడీపీ నాయకులు దీనికేం సమాధానం చెబుతారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై దుర్భుద్దిని బయటపెట్టుకున్నాడు చంద్రబాబు. తెలంగాణకు పట్టిన శని ఈ రెండుకళ్ల సిద్దాంతం బాబు. రాష్ట్రం నుంచి తన్ని తరిమేసినా ఈ దరిద్రం మనల్ని వదలడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో తమ రాష్ట్రానికి ముప్పంటూ ఏపీ కేంద్రానికి 9వ సారి లేఖ రాసింది. సాంకేతిక అనుమతుల జారీపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విభజన చట్టానికి విరుద్దంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారంటున్న ఏపీ సర్కార్.. ఒక్కసారి కళ్లు తెరచి చూడాలి. తెలంగాణకు 1300 టీఎంసీల నీరు గోదావరి నుంచి వాడుకునే అధికారం ఉంది. అంతకుమించి చుక్క నీరు తెలంగాణ వాడుకోదు.

దొడ్డిదారిన పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు దోచుకెళ్తుంది ఏపీ ప్రభుత్వమే. గోదావరి నుంచి నీటిని తీసుకెళ్తే.. అంతే మొత్తం వాటా కృష్ణాలో వదులుకోవాల్సి ఉంటుంది. కానీ.. తెలంగాణ సర్కారు చూసి చూడనట్లు వదిలేస్తే.. ఇవాళ అదే సర్కారుకు వ్యతిరేకంగా లేఖలు రాస్తారా?. తెలంగాణ సర్కార్ కన్నెర్ర చేస్తే…పోతిరెడ్డిపాడు, పట్టిసీమ నుంచి చుక్కనీరు కూడా తీసుకెళ్లలేరు జాగ్రత్త. ఏం తమాషాగా ఉందా?. తగువు పెట్టుకోవాలని ఉందా?. పూర్తి కావొస్తున్న ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే.. చంద్రబాబు పురుగులు పడిపోవడం తప్ప కొత్తగా సాధించేది ఏమీ ఉండదు.

కాళేశ్వరం దగ్గర వచ్చి అడ్డంగా, నిలువుగా పడుకున్నా పనులు మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఇట్లనే కుట్రలు చేసి పాలమూరు ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని చూశావ్. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే.. చివరికి వెనక్కి తగ్గావ్. కాళేశ్వరం విషయంలో వేలు పెట్టాలని చూస్తే.. నువ్వు తెలంగాణలో అడుగు పెట్టలేవు చంద్రబాబు. నీ పార్టీ జెండా కాదు కదా?. నీ పార్టీ పేరు ఎత్తిన వారిని కూడా పొలిమేరల దాకా జనమే తరుముతారు జాగ్రత్త.

Top