You are here
Home > Latest News > నాలుగున్నర లక్షలు తర్వాత.. ముందు ఉన్న సైన్యాన్ని కాపాడుకోండి!

నాలుగున్నర లక్షలు తర్వాత.. ముందు ఉన్న సైన్యాన్ని కాపాడుకోండి!

Spread the love
  •  ఉత్తమ కుమారుడి ఉత్తర ప్రగల్భాలు
  •  కేడర్ చేజారుతుంటే పట్టింపులేని పీసీసీ చీఫ్
  •  కమిటీల పేరుతో నాయకుడి కాలయాపన

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికి జనమంతా జేజేలు పలుకుతుంటే.. ఏదీ చేయలేని నిస్సహాయత కాంగ్రెస్ శ్రేణులను ఆవహిస్తోంది. అందుకే.. కాంగ్రెస్ లో ఉండేకంటే.. జనం మెచ్చిన.. జనం నచ్చిన టీఆర్ఎస్ తో కలిసి నడిస్తేనే మంచిదని అనుకుంటూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో సింహభాగం అధికార పార్టీకి అండదండగా నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. జై కేసీఆర్ అని ఆఫ్ ద రికార్డ్ గా నినదిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్ చేతగానితనానికి అడుగడుగునా దహించుకుపోతున్నారు.

ఇలాంటి సమయంలో.. కేడర్ ను కాపాడుకోవాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నాలుగున్నర లక్షల మందితో కాంగ్రెస్ సైన్యాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతూ.. నవ్వులపాలైపోతున్నారు. కేడర్ కే దిక్కులేదురా ఉత్తమకుమారా అంటుంటే.. పోలింగ్ బూత్ స్థాయిలో 14 మంది చొప్పున ఒక కమిటీ నియమిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వర్గాలకు చేరువ అవుతామని అంటూ.. అసలు అసంతృప్తితో ఉన్న వర్గాలు ఏవన్న విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.

ఇలాంటి ఉత్తమ్ అండ్ బ్యాచ్ ను చూసి కాంగ్రెస్ కార్యకర్తలే సిగ్గుతో తలదించుకుంటున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం మాని.. భవిష్యత్ పై భరోసా కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాని హితవు పలుకుతున్నారు. లేదంటే.. తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని.. అందుకు సమయం కూడా దగ్గరలోనే ఉందని స్పష్టమైన హెచ్చరికలను అధిష్టానానికి పంపిస్తున్నారు.

ఇప్పటికైనా ఉత్తమ్ తో పాటు.. పదవుల కోసం ఆరాటపడే కాంగ్రెస్ నాయకులు మారాల్సిన అవసరం ఉందని తమ పార్టీ పెద్దలకు స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు.

Top