You are here
Home > Latest News > నియామకాలు లేవన్న ప్రతిపక్షాల పిచ్చి మాటలకు మూతోఢ్ జవాబు ఇచ్చిన విద్యుత్ శాఖ.

నియామకాలు లేవన్న ప్రతిపక్షాల పిచ్చి మాటలకు మూతోఢ్ జవాబు ఇచ్చిన విద్యుత్ శాఖ.

Spread the love
  • నియామకాలు లేవన్న ప్రతిపక్షాల పిచ్చి మాటలకు మూతోఢ్ జవాబు ఇచ్చిన విద్యుత్ శాఖ.
  • ఐదేళ్లలో ముప్పై వేల పైచిలుకు ఉద్యోగాలతో రికార్డ్
  • మరో రెండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఇంకొంత ముందుకు తెలంగాణ విద్యుత్ శాఖ
  • ప్రతిపక్షాల పిచ్చి వాదనకు పని తోనే సమాధానం చెప్పిన సీఎం కేసీఆర్.
 
గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అని అనడానికి నిదర్శనంగా, గత ఐదేళ్ళలో తెలంగాణ విద్యుత్ శాఖ ముప్పై వేల పైచిలుకు నియామకాలు చేపట్టి ఆల్టైమ్ రికార్డు సాధించింది.తెలంగాణ రాష్ట్రం నీళ్ళు,నియామకాలు, నిధులు అన్న నినాదంతో సాగితే నీళ్లకు కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులతో తెలంగాణ దాహార్తిని తీర్చిన సీఎం కేసీఆర్.పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్గధామంగా మార్చి నిధుల వర్షం కురిపించాడు. తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు జరగలేదు అని ప్రతిపక్షాలు పిచ్చి మాటలకు చెంపపెట్టులాంటి సమాధానంగా, ఐదేళ్లలో కేవలం విద్యుత్ శాఖలో మాత్రమే ముప్ఫై వేల నియామకాల తో ఆల్ టైమ్ రికార్డు సృష్టించి తెలంగాణ రాష్ట్రం పై కేసీఆర్ కి ఉన్న నిబద్ధత అంటే ఏంటో మరోసారి నిరూపించింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
వీలు చిక్కినప్పుడల్లా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని విమర్శిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేయట్లేదు అని, దిక్కు మాలిన విమర్శలు చేయక ప్రతిపక్షాలు అంత మూర్ఖంగా ఉండక ఇకనైనా కొంచెం లెక్కలు తెలుసుకొని వాస్తవాలను ప్రజలకు చూపిస్తే బాగుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పోగొట్టాలని ఉద్దేశంతో ఉద్యోగాల కల్పనకు ముందు నుంచి కూడా సానుకూలంగానే ఉంది, అయినా కూడా ఉద్యోగ కల్పనా సజావుగా జరిగితే ప్రతిపక్షాల ఆటలు సాగవని ఉద్దేశంతో ముందు నుంచి కోర్టుల్లో కేసులు వేస్తూ ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆలస్యం చేస్తూనే ఉంది.
 
వీధిలో ఏనుగు పోయినప్పుడు కుక్కలు మోరగడం సర్వసాధారణం.కుక్కలు మొరిగిన ఏనుగు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అదే రీతిన గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా దాన్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం తన పని తాను చేస్తూనే ఉన్నాడు.అందులో భాగంగానే ఒక్క విద్యుత్ శాఖలో మాత్రమే ఐదేళ్లలో ముప్ఫై వేల ఉద్యోగ కల్పన తో పాటు మరో రెండు వేల నియామకాల నోటిఫికేషన్తో తెలంగాణ రాష్ట్రంపై తన నిబద్ధతను ఏంటో చూపించాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇకనైనా ప్రతిపక్షాలు మొండిగా విమర్శలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు వివరించి ఇంకా ఏం కావాలో తెలుసుకుని పోరాడితే బాగుంటుంది అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
Top