You are here
Home > Latest News > నిరుద్యోగం నిన్నటి మాట కేసీఆర్ వచ్చాక లక్ష ఉద్యోగాలు

నిరుద్యోగం నిన్నటి మాట కేసీఆర్ వచ్చాక లక్ష ఉద్యోగాలు

Spread the love

 

  • ఉద్యోగుల జీతాలు రెట్టింపు
  • క్యాలెండ‌ర్ విధానంలో పోస్టుల భ‌ర్తీ
  • స్థానికుల‌కు పెద్ద‌పీట‌

 

రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని మంచి సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నా, సుప‌రిపాల‌న అందిస్తున్నా నిరుద్యోగ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌కుంటే సామాజిక సంక్షేమ అనే మాట‌కే అర్థ‌మే లేదు. ఉద్యోగం ఉన్న మ‌నిషికి ఆత్మ‌విశ్వాసం ఉంటుంది. కుటుంబాన్ని బాగా చూసుకోగ‌లుగుతాడు. అత‌డు/ఆమె జీవ‌న నాణ్య‌త పెరుగుతుంది. స‌మాజంలో త‌గిన గౌర‌వం ఉంటుంది. త‌న‌కు ఉపాధి చూపిన ప్ర‌భుత్వంపై గౌర‌వ‌మూ ఉంటుంది. లేక‌పోతే సంఘ వ్య‌తిరేక శ‌క్తిగా మారే ప్ర‌మాదం ఉంటుంది. అరాచ‌కాలూ నేరాలూ పెరుగుతాయి. తెలంగాణ రాక‌ముందు మ‌న ఉద్యోగాల‌న్నీ ఆంధ్రాకు త‌ర‌లిపోయాయి. అందుకే కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ఉద్యోగాల భ‌ర్తీని యుద్ద‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టారు. ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌ను ఆదుకున్నారు.

ముందు చూపుతో మూడంచెల విధానం

రాష్ట్ర‌వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు మూడంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీలను భర్తీచేయడం, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం ఇందులోని ముఖ్యాంశాలు. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం, వ్యాపారాన్ని సరళతరంచేయడంలో వేల ఉద్యోగాలు సృష్టించారు. ప్రభుత్వశాఖల్లో 1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపగా.. 87 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో 48 వేల ఉద్యోగాలను అవినీతి ఆరోపణలకు ఆస్కారంలేకుండా పారదర్శంగా భర్తీ చేశారు. రాష్ట్రంలో 8 వేల పైగా పరిశ్రమలకు అనుమతులిచ్చారు. వాటిలో 60 శాతానికిపైగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. నిరుద్యోగ సమస్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిష్కారం చూపేలా పారిశ్రామిక విధానాల‌ను రూపొందిస్తున్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా 8 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించగలిగారు. ఇండియాలో మ‌రే ఇతర రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ ఇంత‌టి ఘ‌న‌త సాధించ‌లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే రిజర్వేషన్ సాధించుకోగలిగింది మ‌న ప్ర‌భుత్వం.

గ‌తం భ‌యంక‌రం

కాంగ్రెస్ ఏలుబడిలో ఉమ్మడిరాష్ట్రంలో 2004-2014 మధ్య ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసిన ఉద్యోగాలసంఖ్య కేవలం 24,086. వాటిలో తెలంగాణవారికి దక్కిన పోస్టులు 6 వేలు కూడా దాటలేదు. వీటిలో 15వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న 2011-14 మధ్య కాలంలో విడుదలైనవే. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ యువత ఉద్యోగ కలను సాకారం చేసేందుకు టీఎస్‌పీఎస్సీని ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ మూడున్నరేండ్ల కాలంలోనే పలు ఉద్యోగాల భర్తీకి ఏకంగా 121 నోటిఫికేషన్లు జారీచేసింది. మొత్తం 40,921 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి చరిత్ర సృష్టించింది. 20,360 కొలువుల ఫలితాలు విడుదలయ్యాయి. టీఆర్టీ ప్రక్రియ తుది దశకు చేరింది. దీని ద్వారా 8,792 కొలువులు భర్తీ చేయనున్నారు.

తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయం

తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమయ్యే ఉద్యోగుల ఎంపిక కోసం కీలకమైన నిర్ణయాలను తెలంగాణ ఎంచుకుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, నీళ్లు, విద్యుత్, అటవీ రంగాల్లో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. వ్యవసాయశాఖలో 2,100 ఏఈవోలను సృష్టించింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కోసం 2వేల పోస్టులు భర్తీ చేసింది. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలో నాలుగోసారి నోటిఫికేషన్లిచ్చింది. వెటర్నరీశాఖలో 450 పోస్టులకు.. విద్యారంగంలో టీఆర్టీ, గురుకులాలు అన్ని కలుపుకొని 18 వేల పోస్టుల నియమాక ప్రక్రియ పూర్తి కావ‌స్తున్న‌ది. వైద్యశాఖలో 6వేలకుపైగా డాక్టర్లు, నర్సులు, అటవీశాఖలో 2వేల పోస్టుల భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉంది.

నియామక సంస్థలు.. వేల ఉద్యోగాలు

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, విద్యుత్ సంస్థ, సింగరేణి, వైద్య విభాగం, గురుకులాల బోర్డువంటివి అనేక పోస్టులను నింపిం ది. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా ఇప్పటి వరకు 11వేల ఉద్యోగాలు నింపింది. 18,420 ఉద్యోగాల భర్తీ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. విద్యుత్‌శాఖలో పలునోటిఫికేషన్ల ద్వారా 2,100మంది ఇంజినీర్లు, 1,175 మం ది జేఎల్‌ఎం, వివిధ విభాగాల్లో మరో 400మంది నియామకం జరిగింది. 40 మంది కెమిస్ట్‌లనుకూడా నియమించారు. మరో ఎనిమిది వేల మంది (పలు విభాగాల్లో వివిధ స్థాయిల్లో) ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నది. సింగరేణిలో 7,500 ఉద్యోగాలభర్తీ ప్రక్రియ పూర్తయింది. ఈ విభాగాలకు చెందినవన్నీ కలుపుకొంటే.. మొత్తం సంఖ్య 48 వేలకుపైనే ఉంటుంది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ 40,921 కొలువుల భర్తీచేసే ప్రక్రియను తుదిదశకు చేర్చుతున్నది. స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇప్పటికే 85 శాతం పూర్తయింది.   2,932 టీజీటీ పోస్టుల భర్తీకి, 281 జూనియర్ లెక్చరర్లు పోస్టుల భర్తీకి ఈ ఏడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. రెండు డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కోల పరిధిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న 23,500 మందిని రెగ్యులరైజ్ చేసి ఆర్టిజన్స్‌గా గుర్తించారు. ఇవ‌న్నీ క‌లుపుకుంటే తెరాస ప్ర‌భుత్వం ప్రైవేటు, ప్ర‌భుత్వ‌రంగాల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య రెండు ల‌క్ష‌లు దాటుతుంది.

 

 

 

Top