You are here
Home > Latest News > నిరుద్యోగులను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ షబ్బీర్..!

నిరుద్యోగులను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ షబ్బీర్..!

Spread the love

 

  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని ప్రతి వర్గాన్ని అణిచివేసింది..
  • అధికారంలో ఉన్నప్పుడు మీరు నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోలేదు…
  • ఒకేసారి వేల సంఖ్యలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. నిరుద్యోగులను నట్టేట ముంచిందే కాంగ్రెస్ పార్టీ. అసలు.. తెలంగాణలోని ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడేమో సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని సీఎం కేసీఆర్ ఏనాడూ చెప్పలేదు. కాంగ్రెస్ నేతలే లేనిపోనివి సృష్టిస్తున్నారు. సిగ్గూశరం లేని సన్నాసులు సీఎం కేసీఆర్ పై బురద జల్లాలని చూస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఏనాడూ భర్తీ చేయని విధంగా.. దేశంలోనే తొలిసారి వేల సంఖ్యలో పోలీసుల నియామకాలను చేపడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వేల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయింది షబ్బీర్. ముందు మీకు నిరుద్యోగులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉందా? లేదు. మీరు మాత్రం మీ కడుపు నింపుకున్నారు. తెలంగాణకు అన్యాయం చేశారు. ఇప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.

ఏదో ఒక్క రోజు జాబ్ మేళా పెట్టి.. ఇక తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరినీ మేమే ఆదుకుంటున్నామన్నట్టు జబ్బలు చరుచుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదేనా మీరు ఆదుకునేది. అధికారంలో ఉన్నప్పుడే మీరు నిరుద్యోగులను పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటున్నట్లు మీరు నాటకాలు ఆడుతుంటే ఎవరికి తెలియదు. తెలంగాణ ప్రజలు అంతా చూస్తున్నారు. మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమి కొడితేనే తెలంగాణ అభివృద్ది ప్రశాంతంగా జరుగుతుంది.

Top