You are here
Home > Latest News > నిర్మలమ్మా.. మీరు ఇవ్వరు.. మమ్మల్ని తెచ్చుకోనివ్వరా?

నిర్మలమ్మా.. మీరు ఇవ్వరు.. మమ్మల్ని తెచ్చుకోనివ్వరా?

Spread the love

నిర్మలమ్మా.. మీరు ఇవ్వరు.. మమ్మల్ని తెచ్చుకోనివ్వరా?

  • రాష్ట్ర అప్పులపై కేంద్ర మంత్రి నిర్మల వింతవాదన
  • జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావించని మూర్ఖత్వం
  • తమ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యంపై వ్యూహాత్మక మౌనం

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్.. రాజ్యసభ వేదికగా బీజేపీకే సాధ్యమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడ్డనాటికి తెలంగాణ అప్పులు 69 వేల కోట్లుగా ఉంటే.. ఇప్పటికి 159 శాతం పెరిగి లక్షా 80 వేల కోట్లు రూపాలకు చేరిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అదే సమయంలో.. ఆమె కేంద్రం నుంచి రాష్ట్రానికి చేస్తున్న సహాయాన్నీ వివరించి ఉంటే బాగుండేది.

కానీ.. ఏం చేస్తున్నారని చెబుతారు? పన్నులు పేరుతో.. జీఎస్టీ రూపంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ వందల కోట్ల రూపాయల మొత్తాన్ని చట్టాల పేరుతో కేంద్రం తెలంగాణ నుంచి వసూలు చేస్తోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తూ.. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మొండి చేయి చూపింది. రాష్ట్ర ఎంపీలు.. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు ఎన్నిసార్లు కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసినా.. బుట్టదాఖలు చేసింది.

ఏటా బడ్జెట్ కేటాయింపుల్లోనూ అంతేలేని వివక్ష కొనసాగిస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వందల కోట్ల తాయిలాలు ప్రకటించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ విషయంలో మాత్రం తమ హవా నడవదన్న వాస్తవాన్ని గుర్తించి.. నిధుల కేటాయింపులో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఇంతగా దగాకోరు ప్రదర్శిస్తున్న కారణంగానే.. రాష్ట్ర ప్రజలు తీర్చాల్సిన వారి జీవితాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్న కారణంగానే.. తిరిగి అప్పులు తీరుస్తామన్న నమ్మకం ఉన్న కారణంగానే.. రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుని మరీ.. అంతులేని అభివృద్ధిని సాధిస్తోంది.

దేశానికి మార్గదర్శకంగా నిలిచేలా తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం పురోగమించేలా చేస్తోంది. ఇదంతా పట్టించుకోని కేంద్రం.. అప్పులను మాత్రమే హైలైట్ చేస్తూ.. జనానికి అడ్డంగా దొరికిపోయింది.

Top