You are here
Home > Latest News > నీకు గెలిచే దమ్ములేక పిచ్చి కూతలు కూస్తున్నవా రేవంత్

నీకు గెలిచే దమ్ములేక పిచ్చి కూతలు కూస్తున్నవా రేవంత్

Spread the love
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నీకు ఇదే గతి..
పోయేకాలం వచ్చింది నీకురా దద్దమ్మ..
నీకు చేతగాక వేరేవాళ్లను అంటున్నావా?
ముందస్తు ఎన్నికలు వచ్చిందే మీలాంటి వాళ్ల ఆటకట్టించడానికి రేవంత్ రెడ్డి. మీరు తెలంగాణ అభివృద్ధిని ఎలా అడ్డుకున్నారో తెలంగాణ ప్రజలకు తెలియదనుకున్నారు మీరు. నువ్వు కొడంగల్‌లో ఎంత ఘోరంగా ఓడిపోయావో అందరికీ తెలుసు. నువ్వెందుకు ఓడిపోయావో నీకూ తెలుసు. నువ్వు కొడంగల్‌కు చేసిందేమీ లేదు. నువ్వు కేవలం మాటలకే పరిమితం అయ్యావు. తొడగొట్టడం, మీసాలు తిప్పినంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తారా? నువ్వు కేవలం మాటలకే పరిమితమని తెలుసుకున్న కొడంగల్ ప్రజలు నిన్ను ఘోరాతిఘోరంగా ఓడించారు. అయినా నీకు ఇంకా సిగ్గు రావట్లేదా? నీకు పోయే కాలం వచ్చింది కాబట్టే నిన్ను తెలంగాణ ప్రజలు ఓడించారు. అయినా కొడంగల్‌ను వదలవా?
వంగలేక మంగళవారం అన్నాడట వెనకటికి నీలాంటోడు. నీకు గెలిచే దమ్ములేక సీఎం కేసీఆర్‌పై బురద జల్లుతున్నావా? ఓడినా నీకు ఇంకా సిగ్గు రాలేదా రేవంత్. ఇంకా నీ తొడగొట్టుడు ఆపవా? నువ్వు తొడ కొట్టినంత మాత్రాన గెలుస్తావా? నియోజకవర్గాన్ని పట్టించుకుంటే గెలుస్తారు. నువ్వు ఉన్నన్ని రోజులూ కొడంగల్‌లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు చూడు కొడంగల్ అభివృద్ధి ఎలా జరుగుతుందో. అభివృద్ధి అంటే ఇది అని నీకు తెలంగాణ ప్రభుత్వం చూపిస్తుంది.
కొడంగల్ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారు. నీలాంటి టైమ్ పాస్‌గాళ్లను ఏరిపారేశారు. నువ్వు ఇంకా ఏం సాధిద్దామని కొడంగల్‌లో ఈ మీటింగ్‌లు పెడుతున్నావు. నీ మొసలి కన్నీరును పట్టించుకునేవారు ఎవరూ లేరు. నీ ఖేల్ ఖతం అయిపోయింది రేవంత్. నువ్వెన్ని కపట నాటకాలు ఆడినా నిన్ను కొడంగల్ ప్రజలు ఇక నమ్మరు.
Top