You are here
Home > Latest News > నీ దోపిడీ చరిత్ర చెబితే.. బతకగలవా కోమటిరెడ్డీ?

నీ దోపిడీ చరిత్ర చెబితే.. బతకగలవా కోమటిరెడ్డీ?

Spread the love

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ.. అదుపు తప్పి మాట్లాడకు. అనవసర ప్రేలాపనలు చేయకు. చేసిన తప్పును తెలుసుకుని.. ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడ్డం అలవాటు చేసుకో. లేదంటే.. నీకు ఇప్పటికే ప్రజా కోర్టులో ఖాయమైన శిక్షను మరింత తొందరగా జనం నిర్ణయం తీసుకుంటారు. ఏం దోపిడీ చేశారని ఇలా మాట్లాడుతున్నావ్?

సంక్షేమ పథకాలకు ఏటా 35 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయడం నీకు దోపిడీలా కనిపిస్తోందా? ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజల చెంతకు చేర్చి.. వారి ఆదాయాన్ని కూడా పెంచుతుండడం నీకు దోపిడీలా కనిపిస్తోందా? నయీం లాంటి వాళ్లతో నీకు నేరుగా సంబంధాలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వస్తే.. చెడ్డీ తడిసిపోయి.. గిలగిలా వణికిపోయి.. ఆఖరికి నువ్వు మీడియా ముందుకు వచ్చి నిన్ను నువ్వు బయటపెట్టుకున్నది నిజం కాదా?

మామూలు ఆరోపణకే నువ్వు ఇంతగా వణికిపోయావంటే.. తెరవెనక దందాలు ఎన్ని చేసి ఉండాలి? ఎన్నింటిలో భాగమై ఉండాలి? ఈ విషయంలో నీ వైఖరి ఏంటి? నయీం పోయినంత మాత్రాన చరిత్ర చెరిగిపోతుందా? అన్నీ జనాలు గమనిస్తున్నారు. సంఘానికి చీడపురుగులా మారుతున్న నిన్ను.. అవసరమైతే రాజకీయాల్లో సంపూర్ణంగా ఇంటికే పరిమితం చేసేలా జనాలు ఆలోచించుకుంటున్నారు.

ఆ ఫలితం నీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అని ఆలోచించుకో. తర్వాత మళ్లీ నీకు ఇంత కుదురైన పరిస్థితి రాదు.

Top