You are here
Home > Latest News > నీ పాచికలు ఇక్కడ పారవు అమిత్ షా..

నీ పాచికలు ఇక్కడ పారవు అమిత్ షా..

Spread the love

 

  • మీ పార్టీ మంత్రులే తెలంగాణ పథకాలను పొగుడుతున్నారు..
  • దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది..
  • ముందు విభజన హామీను నెరవేర్చు అమిత్..

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చి తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని బీజేపీ నాయకులను ఆదేశించాడు. అంత బాగానే ఉంది కాని.. అమిత్ షా అసలు దేశంలో అధికారంలో ఉన్న మీ పార్టీ ఏం చేసింది. దేశ ప్రజలను ఆదుకున్నదా? అణగారిన వర్గాలను పట్టించుకున్నదాణ లేదు. అసలు దేశ ప్రజలే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మట్టుపెట్టడానికి రెడీగా ఉన్నరు. దేశ రాజకీయలను చూసుకోక.. తెలంగాణ మీద ఎందుకు పడ్డట్టు.

తెలంగాణ రాష్ట్రం మిగితా రాష్ర్టాల్లా కాదు అమిత్. ఇదొరకమైన రాష్ట్రం. అంటే.. ఇక్కడి ప్రజలు, అధికార పార్టీ కలిసి అభివృద్ధి చేసుకుంటున్న రాష్ట్రం. తెలంగాణలోని ప్రతి ఒక్కరు తెలంగాణ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తున్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు విముక్తి కలిగించుకొని.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నరు. మరి.. దీన్ని నువ్వు గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటే ఎలా? అది కుదురుతుందా?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు.. సీఎం కేసీఆర్ వెంట ఎవరూ లేరు. ఒక్కరే మొదటి అడుగు వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఏనాడూ వెనకడుగు వేయలేదు. ఆయన ప్రతి క్షణం తెలంగాణ ప్రజల కోసం ఆలోచించే మనిషి. సగటు తెలంగాణ పౌరుడు ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందాలని కోరుకునే వ్యక్తి. తెలంగాణను తన కన్న తల్లిలాగా చూసుకునే వ్యక్తి. తెలంగాణ పౌరులందరినీ తన అన్నాచెల్లెల్లలాగా చూసుకునే వ్యక్తి. తెలంగాణ బిడ్డకు ఏదైనా ఆపద వస్తే కడుపులో పెట్టుకొని చూసుకునే వ్యక్తి. మన కడుపు నింపే రైతన్న బాగుండాలని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన వ్యక్తి. మరి.. తెలంగాణ కోసమే బతుకున్న సీఎం కేసీఆర్‌ను కాదని.. తెలంగాణ ప్రజలు నీ పార్టీకి ఓటేయాలా?

అసలు నీ పార్టీ ఎక్కడిది? నీ పార్టీకి తెలంగాణకు ఏంటి సంబంధం. నువ్వు తెలంగాణ కోసం పుట్టావా? తెలంగాణ కోసం చస్తావా? మీ పార్టీ నాయకులు చస్తారా? తెలంగాణ రాష్ట్రం కోసం చావును కూడా లెక్కచేయని వ్యక్తి సీఎం కేసీఆర్. ఇప్పుడు చెప్పు తెలంగాణ ప్రజలు నీ పార్టీకి ఓటేసి గెలిపించాలా లేక అందరిలో ఒకరిలా మసులుకుంటూ తెలంగాణ బాగోగులు చూసుకుంటున్న సీఎం కేసీఆర్ పార్టీకి ఓటేయాలా? తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. ఎవరికి ఓటేయాలో వాళ్లకు తెలుసు.

ఎన్నికలు ఉంటే తప్ప కనిపించని మీబోటి నాయకులను వాళ్లు చాలామందినే చూశారు. తెలంగాణపై కపట ప్రేమ చూపిస్తూ.. విభజన హామీలను కూడా నెరవేర్చకుండా తెలంగాణ ఉసురు పోసుకుంటున్న మీ పార్టీని గంగల కలపడానికి ప్రజలు రెడీగా ఉన్నారు.

Top