You are here
Home > Uncategorized > నువ్వు తెలంగాణ వ్యక్తివి కావడం…ప్రజలకు శాపం

నువ్వు తెలంగాణ వ్యక్తివి కావడం…ప్రజలకు శాపం

Spread the love

 

  • తెలంగాణ కోసం నువ్వు ఏం చేశావో చెబుతావా?
  • ముందు మీ పార్టీలోని అంతర్గత విభేదాలను పరిష్కరించుకోండి
  • కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ సంక్షేమం కోసం ఆలోచించే ఒక్క నాయకుడైనా ఉన్నాడా?

ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందంట.. అలా ఉంది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పరిస్థితి. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకన్నా అర్థమవుతుందా.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ కాళ్ల దగ్గర సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారా?

ఒకసారి మీ గతంలోకి వెళ్దామా? మీ కాంగ్రెస్ పార్టీలోనే ఒక్క సరైన నాయకుడు ఉన్నాడా? మీపార్టీలో సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసం పని చేసే ఒక్క నాయకుడిని చూపించు. నీ వేలు వేరేవాళ్ల వైపు చూపించే ముందు మిగితా నాలుగు వేళ్లు నిన్నే చూపిస్తాయనే విషయం ఎలా మరిచిపోయావు భట్టి.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతుంటే మీ పార్టీ నాయకులంతా ఏం చేశారు? నువ్వు ఏం చేశావు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదు అని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అన్న మాటలు నీకు గుర్తు లేవా విక్రమార్క. అప్పుడు ఒక తెలంగాణ వ్యక్తిగా ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీయలేదు. నువ్వు సొంత ప్రయోజనాల కోసం కాకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తున్నావా?

60 ఏండ్లు పరిపాలించిన మీ పార్టీ తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేసిందో చెప్పగలవా? ఒక్కమాటలో చెప్పాలంటే మీ కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లలో చేయలేనిది.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగేండ్లలోనే ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టింది.

తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ తన సారథ్యంలో రాష్ట్రాన్ని ఎంతో వేగంగా ముందుకు తీసుకెళ్తుంటే మీకు కళ్లు కుడుతున్నాయి. మీరు చేయరు.. చేసే వాళ్లను చేయనీయరన్నట్టుగా ఉంది మీ వ్యవహారం. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇన్ని పథకాల్లో మీరు ఒక్క పథకాన్నయినా అమలు చేశారా? కనీసం కరెంట్ కోతల నుంచి కూడా రైతన్నకు విముక్తి ఇవ్వలేని మీ ప్రభుత్వాన్ని అఫ్పుడెందుకు నువ్వు నిలదీయలేదు. రైతన్న కంటి కన్నీరును తుడవలేని మీరు.. రైతన్నను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా మీ అభాండాలు. ఇకనైనా మీ మాటలు కట్టిపెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగం కండి.. లేదంటే తెలంగాణ ప్రజలే మిమ్మల్ని తరిమేస్తారు.

Top