You are here
Home > Latest News > నో డౌట్.. సింగరేణిలో విజయం TBGKS దే!

నో డౌట్.. సింగరేణిలో విజయం TBGKS దే!

Spread the love

 

సంక్షేమం అంటే.. దోచుకోవడం కాదు.. ఆదుకోవడం. కార్మికుల జీవితాలు బాగు చేయడమంటే మాటలు చెప్పడం కాదు… చెప్పిన మాటలను చేతల్లో చూపించడం. ఇదీ.. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనుసరిస్తున్న మార్గం. అంత చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కాబట్టే.. సింగరేణి కార్మికుల మనసులు దోచుకుంటూ.. వారి సంక్షేమానికి అనూహ్యమైన చర్యలు తీసుకుంటూ.. కార్మికుల జీవితాలను వృద్ధి బాటల నడిపించగలుగుతున్నారు.. సీఎం కేసీఆర్. సరిగ్గా మూడేళ్ల కింద ఉన్న పరిస్థితులకు.. ఇప్పటి పరిస్థితులకు తేడా గమనిస్తున్న కార్మికులు కూడా.. మా కేసీఆరే.. మమ్మల్ని ఆదుకున్నడు.. ఆయనే మా నిజమైన నాయకుడు అని ఆనందంగా చెబుతున్నారు.
కార్మికులతో పని చేయించుని.. వారి శ్రమను దోచుకుని.. తిరిగి ఏమిచ్చాయి గత ప్రభుత్వాలు? కోట్లకు కోట్లు లాభాలు వస్తున్నా.. అందులో కార్మికులకు సరైన వాటా ఇవ్వకుండా.. ఆ డబ్బులు మొత్తాన్ని మెక్కేశాయి. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ కార్మికుల చెమట కష్టంతో వచ్చిన లాభాలను.. వేరే ప్రాంతాల్లో పెట్టి.. తమ అభివృద్ధికి వాడుకున్నాయి. ఇక్కడ బొగ్గు గనుల్లో చెమటోడుస్తున్న కార్మికుల జీవితాలు మసిబారుతున్నా.. పట్టించుకోకుండా.. నిర్లక్ష్యంగా వదిలేశాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా చేసి.. కార్మికులను ఇబ్బంది పెట్టాయి.
ఇంత చేసినా.. కార్మికులు ఓపిగ్గా ఉన్నారు. తమ ప్రభుత్వం రాకపోతుందా అని ఎదురుచూశారు. ఉద్యమంలో ముందుడి నడిచారు. సంస్థకు నష్టాలు వస్తున్నా.. సమ్మె మాత్రం ఆపకుండా.. ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడారు. ప్రజా పోరాటాల్లో మమేకమయ్యారు. చివరికి అనుకున్న తెలంగాణ సాధించడంలో.. వారూ ఒక భాగమయ్యారు. అంతగా పడిన కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం పొందుతున్నారు.
ప్రజా నాయకుడు.. ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. తెలంగాణ ఫలాలను సింగరేణి కార్మికులు దర్జాగా అందుకుంటున్నారు. సమ్మె చేసిన కాలాన్ని.. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సెలవులుగా పరిగణించి.. జీతాలు ఇచ్చి.. సంచలన చర్య తీసుకుని.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది మన కేసీఆర్ ప్రభుత్వం. ఈ క్రమంలో.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. విశేష కృషి చేసింది. కార్మికుల అభిప్రాయాలను, మనోభావాలను ప్రభుత్వం చెంతకు తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యింది.
అంతే కాదు. గత ప్రభుత్వాలు సింగరేణి సంస్థ ఇచ్చిన లాభాలను తామే అనుభవిస్తే.. ఇప్పటి ప్రభుత్వం మాత్రం లాభాలకు కారణమైన కార్మికుల శ్రమను గుర్తించింది. వారికి.. గత ఏడాది లాభాల్లో 23 శాతం వాటాతో పాటు.. దీపావళి బోనస్ ను అందించింది. దీంతో.. ఒక్కో కార్మికుడికి.. అనూహ్యంగా సగటున 97 వేల రూపాయల నగదు అందింది. దీంతో.. కార్మికుల సంబరానికి హద్దే లేకుండా పోయింది. ఈ ఏడాది కూడా.. అదే రీతిలో.. కార్మికులకు పండగ కానుక అందించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
సరిహద్దు సైనికులను.. బొగ్గు గనులను బయటికి తీస్తూ సంపద సృష్టిస్తున్న కార్మికులనూ ఒకేలా చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వారి జీవితాలను కూడా బంగారుమయం చేసేందుకు అహరహం శ్రమిస్తున్నారు. తనకు వీలైనంత వరకూ.. రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నియామకాలు పెంచుతున్నారు. సంస్థను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఉన్నతాధికారుల నియామకాలు పూర్తి చేస్తున్నారు. సింగరేణి సంస్థను మూలాల నుంచి పటిష్టం చేస్తూ.. మరింత విస్తరించేందుకు శ్రమిస్తున్నారు.
ఈ ప్రక్రియలో.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. కార్మికులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయడంలో విజయవంతం అవుతోంది. కార్మిక సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ.. వాటికి పరిష్కారాలు సాధిస్తూ.. చరిత్ర సృష్టిస్తోంది. ఏటా.. బలాన్ని పెంచుకుంటూ.. కార్మిక సంఘం అంటే.. ఎలా ఉండాలి.. ఎలా పోరాటం చేయాలి.. ఎలా కార్మికుల విషయాల్లో అండదండగా ఉండాలి అన్న విషయాన్ని తన చేతలతో చూపిస్తోంది.
అలాంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని వచ్చే సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిపించుకునేందుకు సంస్థ కార్మికులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. ఎన్నికలు వస్తే.. వెంటనే TBGKS కు ఓటు వేసి.. తమ మద్దతు తెలియజేయాలని ఆరాటపడుతున్నారు. కార్మిక సంక్షేమాన్ని కాంక్షించే.. అందుకు శ్రమించే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్నే గెలిపిస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్నారు.

Top