You are here
Home > Latest News > పగటి కలలు బాగానే కంటున్నావు దాసోజు శ్రవణ్..

పగటి కలలు బాగానే కంటున్నావు దాసోజు శ్రవణ్..

Spread the love

 

  • వీళ్లు అధికారంలోకి వస్తారట.. నవీన్ మిట్టల్ పని పడతారట…
  • మిట్టల్ సంగతి ఏం చూస్తావో అది కూడా చెప్పు దాసోజు..
  • అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతికి కాంగ్రెస్ ను ఏం చేయాలి మరి..?

ఎంతో పారదర్శకంగా జరిగిన టీచర్స్ బదిలీల్లో అవకతవకలు జరిగాయంటూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కేవలం టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లాలన్న ఉద్దేశంతో టీచర్ల బదిలీలు అనే సాకును పట్టుకున్నారు. అదొక్కటే కాదు.. తెలంగాణ ప్రభుత్వం ఏ పని చేసినా.. ఏ పథకం ప్రవేశపెట్టినా దాన్ని విమర్శిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే వీళ్ల లక్ష్యం.

అందుకే దాసోజు శ్రవణ్ అనే వ్యక్తి.. ఈయన పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి అంట… ఆయన టీచర్ల బదిలీల్లో అవకతవకలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నడు. నిజంగా అవకతవకలు జరిగితే.. ఆధారాలతో సహా నిరూపించాలి కానీ ఏదో మైకుల ముందు వాగడం కాదు కదా. రోడ్డు మీద పోతుంటే కుక్క కూడా మొరుగుతుంది. అలా అని మొరిగే కుక్కను ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరి పని వాళ్లది. ఆ కుక్కను ఎలాగైతే పట్టించుకోమో.. ఈ దాసోజు బతుకు కూడా అంతే. కేవలం బద్నాం చేయడానికి చేసే ఇటువంటి ఆరోపణల వల్ల నీకు, నీ పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదు రాజా.

కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ బదిలీలకు బాధ్యుడు. ఏది జరిగినా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అత్యంత పారదర్శకంగా జరిగిన వాటిపై నువ్వు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తుంటే ఆయన స్పందించకూడదా? తప్పును తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? ఆయన వేల కోట్ల అవినీతికి ఆద్యుడని నువ్వంటున్నావు కదా. ఏదీ నోటితో అనడం కాదు దాసోజు.. దమ్ముంటే నువ్వు నిరూపించు. నువ్వు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ జనాలకు చేరుతుంది. వాళ్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి.. ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ చేసే కుట్రలో భాగాలు ఇవన్నీ. ఇదంతా జనాలకు తెలుసు. నువ్వేదో బొంకినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరిమీద పడితే వారి మీద ఆరోపణలు చేయడం కాదు దాసోజు.. దమ్ముంటే ఆధారాలతో సహా నిరూపించు. అప్పుడు నిన్ను తెలంగాణ ప్రజలు నమ్మతారు. లేదంటే నిన్ను, నీ పార్టీని తెలంగాణ నుంచి తరిమి తరిమి కొడతరు. నీ వల్ల, నీ పార్టీ వల్ల తెలంగాణకు పైసా ఫైదా లేదు. తెలంగాణకు దాపురించిన దరిద్రులు మీరు. తెలంగాణ ద్రోహులు. మీరు తెలంగాణకు అవసరం లేదు.

Top