You are here
Home > Uncategorized > పచ్చి అవకాశవాది కోదండరాం!!

పచ్చి అవకాశవాది కోదండరాం!!

Spread the love

కోదండరాం పచ్చి అవకాశవాది అని మరోసారి నిరూపించుకున్నాడు. కొలువులకై కొట్లాట పేరుతో ఓ పనికిమాలిన సభ నిర్వహించి.. అన్నీ అబద్ధాలే చెప్పాడు. ఆ అబద్ధాలు వినలేక.. విద్యార్థులు కూడా సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఖాళీ కుర్చీలు.. పదుల సంఖ్యలో జనాలు మాత్రమే దర్శనమిచ్చారు. అయినా.. ఉన్నవాళ్ల మధ్యనే అవకాశాలను వెతుక్కుని మరీ.. కోదండరాం కుట్రలు చేశాడు.

నిరుద్యోగులు సభకు రాకున్నా.. కొందరు మూకలను సభకు రప్పించుకుని గలాటా చేయలని చూశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేశాడు. ఇసుక కాంట్రాక్టర్లన్నాడు. ఆధారాలు చూపించలేకపోయాడు. మరిన్ని ఆరోపణలు చేశాడు.. రుజువు చేయలేకపోయాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ గురించి మాట్లాడాడు. అది సీఎం వ్యక్తిగత ఆస్తి కాదని అర్థం చేసుకోలేకపోయాడు.

ఆయన ప్రసంగం తీరును విన్న జనాలు, ఆయన పోగేసిన అల్లరిమూకలు మాత్రం.. పెద్దాయన ఏంటీ.. ఇలా తయారయ్యాడు అబద్ధాల కోరులా.. అని చర్చించుకున్నారు. ఒకటి అంటే సరే.. రెండు అంటే సరే. మరీ మూడు అబద్ధాలు చెప్పినా.. జనాలు వింటారు. కానీ.. నోరు తెరిస్తే చాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇలా నోరు పారేసుకుంటే జనాలు ఏమనుకుంటారు?

ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా.. లేదంటారు. నోటిఫికేషన్లు ఇస్తున్నా..ఇవ్వడం లేదంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలు బాగు చేద్దామని ప్రయత్నిస్తున్నా.. కోర్టు కేసులతో అడ్డుకుంటారు. ఇప్పడు కొలువుల కొట్లాట అంటూ.. అబద్ధాలు ప్రచారం చేశారు. అందుకే.. జనాలు కోదండరాంను అబద్ధాల కోరుగా ఫిక్స్ అవుతున్నారు. ఆయన చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదని తేల్చేస్తున్నారు.

Top