You are here
Home > Latest News > పతనమైన కాంగ్రెస్.. నీతులు చెబుతోంది!

పతనమైన కాంగ్రెస్.. నీతులు చెబుతోంది!

Spread the love

దయ్యాలు వేదాలు వల్లిస్తే.. అచ్చంగా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినట్టే ఉంటుంది. విలువలు లేని రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. వందల మంది చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఉన్న ఉత్తమ్.. ఇప్పుడు సింగరేణి ఎన్నికలతో.. టీఆర్ఎస్ పతనం ప్రారంభం అవుతుందని అంటున్నాడు. ఆ మాట అనేప్పుడు కనీసం ఒంటిమీద బట్టలు వేసుకున్నాడో లేడో కూడా తెలియదన్నట్టుగా.. ఉత్తమ్ మాట్లాడుతున్నాడు.

సింగరేణి కార్మికులకు అన్నీ అబద్ధాలే చెబుతున్నాడు. తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ.. రాజకీయ పబ్బం గడిపేందుకు ఆరాటపడుతున్నాడు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది అని చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డీ.. నువ్వు ఆ మాట అనేందుకు సిగ్గు పడాలి. ఎందుకంటే.. ఇచ్చింది సోనియాగాంధీ కాదు. యూపీయే ప్రభుత్వం. ఆ సమయంలో.. యూపీయే కాదు.. ఎన్డీయే కాదు. ఎవరున్నా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే.. ఆ స్థాయిలో ఉద్యమం జరిగింది. కేసీఆర్ నాయకత్వాన.. తెలంగాణ ప్రజానీకం.. కేంద్రం మెడలు వంచింది.

రాజ్యాంగ పరమైన ప్రక్రియతోనే.. తెలంగాణ ఏర్పడింది. అంతే తప్ప.. అందులో సోనియాగాంధీ గొప్పేం లేదు. అసలు సోనియాగాంధీకి ఏం అర్హత ఉందని తెలంగాణ ఇస్తుంది? ఆమె ప్రధాని కాదు.. రాష్ట్రపతి కాదు.. జస్ట్.. యూపీయేకు చైర్ పర్సన్ గా మాత్రమే చేశారు. ఆ హోదా ప్రధాని కంటే ఎక్కువ అని ఉత్తమ్ భావిస్తున్నట్టయితే.. మన్మోహన్ సింగ్ ను పదేళ్ల పాటు రబ్బర్ స్టాంప్ గా వాడుకున్నారు.. అన్న అపవాదును ఇన్ డైరెక్ట్ గా ఉత్తమ్ ఒప్పుకున్నట్టేనా?

పిటిషన్లు వేసి సంక్షేమాన్ని అడ్డుకుంటున్నది మీరయితే.. మళ్లీ ఆ మాటను టీఆర్ఎస్ నాయకులపై వేసి.. అబద్ధాలు చెప్పేందుకు అసలు మీకు నోరెలా వస్తోంది? అబద్ధాలు చెప్పడమే తప్పు అయితే.. మళ్లీ అందుతో తప్పుడు ప్రచారాలు ఒకటి. ఇలా.. ఒకదానిమీద ఒక తప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడే కాదు.. వాళ్ల రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా కూడా.. అదే తీరు చూపిస్తున్నాడు. అందుకే.. ప్రజలు బహిరంగంగా కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నారు.

రాజకీయం చేస్తే పరవాలేదు కానీ.. అధికారం కోసమే రాజకీయం అనేది తప్పుడు చర్య అని ఉత్తమ్ బ్యాచ్ కు చురకలు అంటిస్తున్నారు. తీరు మార్చుకోకుంటే.. కాంగ్రెస్ కోలుకోవడం కష్టమే అని స్పష్టం చేస్తున్నారు.

Top