You are here
Home > Latest News > పనికి మాలిన విమర్శలు తప్ప.. విషయం ఏదైనా ఉందా?

పనికి మాలిన విమర్శలు తప్ప.. విషయం ఏదైనా ఉందా?

Spread the love

సోషల్ పోస్ట్. మళ్లీ తన బుద్ధిని చాటుకుంది. మంచీ చెడూ ఆలోచించకుండా.. నోటికొచ్చినట్టు పాచి వార్తను వండి వార్చేసింది. దాన్ని చదవలేక జనం చచ్చిపోతున్నారు. కొందరైతే.. ఇంతకు మించిన జోకు.. మరోటి లేదంటూ.. నవ్విపోతున్నారు. అయినా.. నాకేంటి సిగ్గు అన్నట్టు వ్యవహరిస్తున్న సోషల్ పోస్ట్ మీడియా.. తన విషాన్ని.. ఇలా చాటుకుంది. ఈ సారి ముఖ్యమంత్రి బదులు.. ఎంపీ వినోద్ కుమార్ ను టార్గెట్ చేసింది.

ఉద్యమం మొదటి నుంచి.. విమర్శలు అతి తక్కువగా ఎదుర్కొన్నవాళ్లతో.. వినోద్ కుమార్ ఒకరు. మంచి విషయ పరిజ్ఞానం ఉన్న నాయకుడిగా.. ఆయనకు పార్టీ శ్రేణుల్లోనే కాదు.. మేధావి వర్గాల్లోనూ మంచి పేరుంది. అందుకే.. ఆయన ప్రతి విషయానికి కాకుండా.. కొన్ని ముఖ్యమైన విషయాలపైనే.. ప్రెస్ మీట్లు పెట్టి.. వాస్తవలను వివరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే.. సింగరేణి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ అనుబంధ సంఘం గురించి.. సందర్భానుసారంగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

కేసీఆర్ చెప్పిన విషయాలు మాత్రమే కాకుండా.. ఆయన చేస్తున్న కృషిని చూసి.. ఓ సాధారణ వ్యక్తిగా స్పందించారు. కేసీఆర్ కృషిని చూస్తుంటే.. సింగరేణిని అంతర్జాతీయ స్థాయి సంస్థగా ఎదిగేలా చేస్తున్నట్టుగానే ఉందని చెప్పారు. దాన్ని వక్రీకరించి.. వక్ర భాష్యాలు చెప్పి.. ఆయన మిగిల్చిన మాటను.. ఈయన వల్లించారంటూ.. సోషల్ పోస్ట్ వార్త రాసేయడం.. చూస్తే.. గుడ్డు మీద ఈకలు పీకినట్టుగానే కనిపిస్తోంది.

కాంగ్రెస్ కు ఏజెంట్ గా మారిన కోదండరాంకు.. మరో ఏజెంట్ గా మారిపోయినట్టుగానే వ్యవహరిస్తున్న ఈ సోషల్ పోస్టు.. తెలంగాణ సమాజానికి కీడు చేయడమే లక్ష్యంగా.. అబద్ధాల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే.. గ్యాప్ వెతుక్కుని మరీ.. వినోద్ కుమార్ పై విమర్శనాత్మక వ్యాసం రాసి.. తాను కూడా విమర్శలు మూటగ్టుకుంది. ఇలాంటి విమర్శలు అలవాటైపోయిన సోషల్ పోస్ట్.. దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే.. మళ్లీ మళ్లీ సర్కార్ పై.. టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుందన్న విషయం కూడా.. ప్రజలకు అర్థమైపోతోంది.

అందుకే.. సోషల్ పోస్ట్ రాతలకు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని.. ఏనుగు ముందు కుక్కలు మొరగడం మామూలే అని ప్రజలు సర్దుకుపోతున్నారు. కేసీఆర్ నాయకత్వానికి ఎప్పటిలాగే.. మద్దతు ఇస్తున్నారు.

Top