You are here
Home > Latest News > పసుపు, జొన్న రైతులను గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు మరి….

పసుపు, జొన్న రైతులను గత ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు మరి….

Spread the love
  • వాళ్ళను అదుకున్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం…
  • త్వరలోనే నిజామాబాద్ లో పసుపు కేంద్రం వస్తుంది..
  • కేంద్రంతో పోరాడి మరి గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది..
గత ప్రభుత్వాలు తెలంగాణ రైతులను ఏపాటి పట్టించుకున్నయో ఎవరికి తెల్వదు. దేశమంతా తెలుసు. పసుపు, జొన్న రైతులను దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోలేదు. టీడీపీ ఎందుకు పట్టించుకోలేదు. వాళ్లకు రైతులు కనిపించలేదా… అప్పుడెందుకు పసుపు, జొన్న రైతుల గోడు పట్టలేదు. మీరు రైతులను పట్టించుకోని ఉంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అలా ఎందుకు ఉండేది మరి.
రైతు బంధు లబ్దిదారులపై 144 సెక్షన్ ఎవరు పెట్టారు. ఊరికనే ఎవరన్నా కేసులు పెడతారా.. వాళ్లకు ఏం పనిలేదా. వాళ్ళు రోడ్ల మీదికి వచ్చి ధర్నా చేస్తే పోలీసులు వాళ్ల డ్యూటీ చేశారు.
దీన్ని అసలు రాద్దాంతం చేయాల్సిన అవసరమే లేదు. రైతులను ఆదుకోవడానికి సీఎం కేసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతుల కోసం, గిట్టుబాటు ధర కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే ఎక్కడా లేవు. రైతులకు ప్రవేశపెట్టిన పథకాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇది చాలదా తెలంగాణ లో రైతులు ఎంత లబ్ది పొందుతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి.
Top