You are here
Home > Latest News > పాపం.. ఉత్తమ్ కు మతి భ్రమించింది!

పాపం.. ఉత్తమ్ కు మతి భ్రమించింది!

Spread the love
  • ఉత్తం కుమార్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతలేదు ..??
  • తెరాస తీసుకుంటున్న నిర్ణయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతుండు ..??
  • గ్రౌండ్ రిపోర్ట్ బట్టి చూస్తుంటే తెరాసకు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించు కోలేని వైనం …

 

కేసీఆర్ పరిపాలనకు కేంద్ర స్థాయిలో అందుతున్న ప్రశంసలు చూసి.. కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టుంది. వచ్చిన వారు కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహదారుడని.. ఆయనకు టీఆర్ఎస్ తో ఎలాంటి రాజకీయ సంబంధం లేదని ఉత్తమ్ తెలుసుకోలేకపోయారు. కేసీఆర్ కిట్ పథకంతో తాను ప్రభావితం అయ్యానని.. రైతులకు పంట పెట్టుబడి పథకం ప్రారంభానికి వస్తానని అరవింద్ చెప్పిన విషయాలను కూడా ఎద్దేవా చేసి.. తన పెద్దరికాన్ని ఉత్తమ్ స్వయంగా దిగజార్చుకున్నారు.

తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పుకుంటున్న ఉత్తమ్.. అది సాధించింది కేసీఆర్ అన్న విషయాన్ని కూడా ప్రస్తావించకుండా.. రాజకీయ స్వార్థాన్ని చాటుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు కాబట్టే.. పోలీస్ రాజ్యం నడుస్తోందంటూ ఉత్తమ్ తప్పుడు కూతలు కూస్తున్నారు. సచివాలయానికి వచ్చినా రాకున్నా.. పరిపాలనకు భంగం కలిగించని ముఖ్యమంత్రి తీరును ఉత్తమ్ గ్రహించలేకపోతున్నారు.

మజ్లిస్ మీద నిజంగానే పోటీ చేస్తామని చెప్పిన ఉత్తమ్.. ఇన్నాళ్లూ ఆ పార్టీపై అబద్ధపు పోటీ చేశామని ఒప్పుకున్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర మార్గంలో.. ఇప్పుడు తాము కూడా బస్సు యాత్ర చేస్తామని చెప్పారు. ఇలా.. అడుగడుగునా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజకీయ వ్యూహాల్లో సమస్త లోపాలను చాటారు. తమను ఎన్నుకోవడం కంటే పెద్ద పాపం లేదన్న వాస్తవాన్ని ప్రజలకు పరోక్షంగా స్పష్టం చేసుకున్నారు.

Top