You are here
Home > Latest News > పాయె… ఉన్న ఇజ్జత్ గూడ పాయె!!

పాయె… ఉన్న ఇజ్జత్ గూడ పాయె!!

Spread the love

 

 

  • – కాంగ్రెస్ నేతలూ.. మొహం ఎక్కడ పెట్టుకుంటారు?
  • – కాళ్లు పట్టుకుని మరీ పద్మినిని వెనక్కి తెచ్చారు
  • – చేతగాని రాజకీయాలెందుకని నిలదీస్తున్న జనాలు

పొద్దున ఒక కండువా… సాయంత్రానికే మరో కండువా. అసలైన అవకాశవాద రాజకీయం అంటే ఇదే. అసలు సిసలు తప్పుడు రాజకీయం అంటే ఇదే. చాలా రోజులుగా కాంగ్రెస్ గురించి చెబుతూనే వస్తున్నాం. ఇప్పుడు అది నిజమే అని దామోదర రాజనరసింహ సతీమణి పద్మినీ రెడ్డి రుజువు చేశారు. నిన్నటికి నిన్న పొద్దున బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె.. అంతలోనే నిర్ణయం ఎందుకు మార్చుకున్నారో.

తన భర్త ఆవేదన అర్థం చేసుకుంటున్నానని.. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఇంత ప్రతిఘటన ఎదురు అవుతుందని ఊహించలేకపోయానని మాత్రమే చెబుతున్న పద్మినీ.. తన నిర్ణయాన్ని ఎవరు ప్రభావితం చేశారన్నదానిపై.. తనను ఎవరు బెదిరించారన్నదానిపై మాత్రం మాట కూడా వెల్లడించలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. పొద్దున పద్మినీ పార్టీని వీడారని తెలియగానే.. ఆమెను తిరిగి హస్తం గూటికే రప్పించేందుకు కాంగ్రెస్ నేతలు విఫలయత్నం చేశారు.

ఆఖరికి తమ వరకూ తాము విజయం సాధించారు. కానీ.. జనాలు మాత్రం ఈ ఎపిసోడ్ అంతా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ ఫెయిల్యూర్ గానే చూస్తున్నారు. ఆయన చేతగాని తనంతోనే.. ఆయనకు తెలియకుండానే పద్మినీ వెళ్లి బీజేపీలో చేరారు అంటే.. ఆయన పరిస్థితి ఏంటో అర్థమవుతోందని చెబుతున్నారు. నయానో భయానో మళ్లీ ఆమెను రప్పించుకున్నారు కానీ.. మరేం లేకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

మంత్రి హరీష్ రావు చెప్పినట్టు.. కాంగ్రెస్ నేతల కుటుంబీకులకే ఆ పార్టీ నచ్చనప్పుడు ఇంక జనానికి ఎందుకు నచ్చుతుంది చెప్పండి? అందుకే.. ఈ ఒక్క ఎపిసోడ్ తో ఆ పార్టీకి ఉన్న కాసింత ఇజ్జత్ మానం కూడ మొత్తం పోయింది.

Top