You are here
Home > Latest News > పాయే… గద్దర్ పరువు కూడా పాయే!

పాయే… గద్దర్ పరువు కూడా పాయే!

Spread the love

– ఉద్యమకారులను బలిగొన్న పార్టీతో ప్రజాయుద్ధనౌక భేటీనా?

– కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ఇన్ని కుట్రలా?

– గద్దర్ తీరుపై తెలంగాణ వ్యాప్తంగా విమర్శల వెల్లువ

పోయింది. ప్రజా యుద్ధనౌకగా గద్దర్ మీదున్న గౌరవం సాంతం పోయింది. ఇన్నాళ్లూ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా గద్దర్ చేసిన ప్రకటనను ప్రజలంతా స్వాగతించినా… ఇప్పుడు కాంగ్రెస్ కు ఆయన వంత పాడుతున్నట్టుగా వ్యవహరించడంతో అసలు గద్దర్ ప్రజా యుద్ధ నౌకేనా లేక రాజకీయ నాయకుడా అన్న అనుమానం కలుగుతోంది. చరిత్ర మరిచిన గద్దర్ ను చూసి తెలంగాణ సమాజం ఆవేదన చెందుతోంది.

తెలంగాణ ఏర్పాటులో ఆలస్యంతో… వందల మంది నిండు ప్రాణాలను బలి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్ ది. అలాంటి కాంగ్రెస్ నేతలతో గద్దర్ సమావేశం కావడం దేనికి సంకేతం? అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించేందుకే తాను రాజకీయాల్లోకి వస్తానని… ఓటుపై జనంలో అవగాహన పెంచుతానని కొన్నాళ్ల కిందట గద్దర్ ఉద్వేగభరితంగా ప్రకటించారు. ఆయన రాకను పార్టీలకు అతీతంగా నేతలు కూడా స్వాగతించారు.

కానీ… జరుగుతున్నదేంటి? అసలు గద్దర్ భట్టి విక్రమార్కతో ఎందుకు భేటీ అయ్యారు? త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ భేటీ వెనక ఆంతర్యం ఏంటి? రాజకీయాలతో ముడి పడి ఉన్న విషయం అయితే టీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదు. ఎవరు ఎవరితో అయినా భేటీ కావొచ్చు. రాష్ట్ర ప్రజలతంతా కేసీఆర్ పరిపాలనను కంటికి రెప్పలా కాచుకున్నంత కాలం… ఏ పార్టీ ఇంకెవరితో చర్చలు చేసినా పెద్ద విషయం కాదు.

కానీ… ఈ భేటీ వెనక కుట్ర ఏమైనా దాగి ఉంటే మాత్రం తెలంగాణ ప్రజలు తప్పక తిప్పికొడతారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధాన్ని కారు అనే వాహనంపైకి ఎక్కి మరీ ప్రజాస్వామ్య విరోధులపై ఎక్కు పెడతారు. కారును ముందుకు పోనిచ్చి… కేసీఆర్ కే అధికారాన్ని అప్పగిస్తారు. మరోసారి ముఖ్యమంత్రిని చేస్తారు. ఇతి తథ్యం

Top