You are here
Home > Latest News > పార్టీ పెట్టడానికి కారణాలు వెతుకుతున్న కోదండరాం ……

పార్టీ పెట్టడానికి కారణాలు వెతుకుతున్న కోదండరాం ……

Spread the love

కోదండరాం! విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడడం లో నీకు సాటి మరెవరూ లేరు.`నాకు పార్టీ పెట్టాలని ఉన్నది`,లేదా,`నేను పార్టీ పెడతాను,అని స్పష్టంగా చెప్పు.నీకు వద్దన్నది ఎవరు.ఇది ప్రజాస్వామ్యం ఇక్కడ ఎవరైనా పార్టీ పెట్టవచ్చు.ఆ మాత్రం దానికి ఈ కుంటి  సాకులెందుకు?పార్టీ పెట్టమని జే.ఏ.సి.నాయకులు ఒత్తిడి తెస్తున్నారు,ప్రజల నుండి ఒత్తిడి వస్తున్నది,అని సన్నాయినొక్కులు ఎందుకు నొక్కుతున్నావు?నిజంగా పార్టీ పెట్టాలనుకునేవాడు ఇలా మీనమేషాలు లెక్కపెట్టడు.ఎవరో ఒత్తిడి తెస్తున్నారు కాబట్టి,మరెవరో మొహమాటపెడుతున్నారు కాబట్టి ,ఇలాంటి కారణాలు చెప్పి ఎవరూ పార్టీ పెట్టరు.పార్టీ పెట్టడం నా కోసం కాదు ప్రజల కోసం అనుకున్నవాడు,క్షణకాలం కూడా ఆలోచించడు.

ఇక్కడే నీకూ కేసీఆర్ కు ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది.ఆయన ఇలా సాగదీయలేదు,పార్టీ పెట్టాలనుకున్నాడు,పదవులకు రాజీనామా చేసాడు,పార్టీ డిక్లేర్ చేసాడు.కలిసి వచ్చేవారు వచ్చారు,లేని వారు లేదు.ఆయనను పార్టీ పెట్టమని ఎవరూ వినతి పత్రాలు ఇవ్వలేదు,ఈ సో కాల్డ్ నువ్వంటున్న ప్రజలు కూడా పార్టీ పెట్టమని వేడుకోలేదు.తనకు తానే  స్వయం శక్తిని నమ్మి,,ఆత్మ విశ్వాసం తో ముందుకు కదిలాడు.దాదాపు అసాధ్యం,అత్యంత కష్ట సాధ్యమైన లక్ష్యం కొరకు పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం చేసి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.అప్పుడు ఆయనకు నీకు ఉన్నట్టు జాకులు లేవు,టీ.మాసులు లేవు.అయినా కదిలాడు,కోట్లమందిని కదిలించాడు,అదీ నాయకత్వం అంటే.

కోదండరాం,నీలో ఎక్కడో అపరాధ భావన ఉన్నట్టు కనిపిస్తున్నది.ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే,మొదట నువ్వు టీ.జాక్.(నీది కానిది)కేవలం తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే ఒక సంస్థ.రాజేకీయ పార్టీలతో మాకు సంభందం లేదు.మాకు పార్టీ పెట్టె ఆలోచన లేనే లేదు,మేము తెలంగాణ కు వాచ్ డాగ్ లము,అంతే, అన్న నువ్వు,ఇప్పుడు నీ మనసు పార్టీ వైపుకు మళ్ళింది.అందుకే ఈ తొక్కలో కారణాలు చెబుతున్నావు.పార్టీ పెట్టక ముందే ఆత్మరక్షణా ధోరణిలో మాట్లాడుతున్నావు.నీ నిర్ణయానికి కొన్ని డిఫెన్సివ్  ఆర్గ్యుమెంట్స్ రెడీ చేసుకుంటున్నావు.

పార్టీ పెట్టక ముందు అందరూ చెప్పే నీతులే నువ్వు కూడా చెబుతున్నావు.పార్టీ పెట్టి అధికారంలోకి వస్తే కదా దొరలెవరో,దొంగలెవరో తెలిసేది.తెలంగాణ సమస్యల పై పోరాటం అంటావు కాని హై కోర్టు విభజన మీద కొట్లాడవు,కృష్ణా ,గోదావరి నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ మీద మాట్లాడవు.పార్టీలతో సంభందం లేదు అంటూనే పార్టీలతో వేదికలు పంచుకుంటావు.కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ,సి.పీ.ఎం పాలిత రాష్ట్రాలలో ఉద్యోగ వార్షిక క్యాలెండర్ ను  ప్రకటించారా?వాళ్ళు నిరుద్యోగ భ్రుతిని ఇస్తున్నారా?ఇలాంటివి ప్రశ్నించవు.ఏతావాతా తెలిసేది ఏమిటంటే తెలంగాణ సమస్యలు,ప్రజా సమస్యలు వీటికన్నా నీకు కేసీఆర్ ను గద్దె దించడమే ప్రథమ ప్రాధాన్యతా అంశం అని తేలిపోయింది.`హాథీ కే దాంత్ దిఖానేకే ఔర్ ,చబానేకే ఔర్ హోతే హై`.

Top