You are here
Home > Latest News > పెట్టుబడులకు స్వర్గధామం.. తెలంగాణ రాష్ట్రం.

పెట్టుబడులకు స్వర్గధామం.. తెలంగాణ రాష్ట్రం.

Spread the love

పెట్టుబడులు రప్పిస్తున్నాం.. ముందు ముందు రాష్ట్రం దశనే మార్చేయబోతున్నాం అని మాటలు చెప్పడం మాత్రమే కాదు. ఆ మాటలను టీఎస్ ఐ పాస్ లాంటి చట్టాలతో ఎలా విజయవంతంగా అమలు చేయాలన్నదీ.. చేసి చూపిస్తున్నారు.. మన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్. దేశాన్ని మాత్రమే కాదు.. పెట్టుబడులకు సులభ విధానాల్లో అనుమతులు వచ్చేలా ప్రపంచాన్ని ఆకర్షించిన టీఎస్ ఐ పాస్ చట్టాన్ని తయారు చేసిన తీరుపై.. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇప్పటివరకూ.. టీఎస్ ఐపాస్ తో మన రాష్ట్రం సాధించిన విజయాలను ఓ సారి పరిశీలిస్తే.. కేవలం మూడేళ్లలోనే 71 వేల కోట్ల రూపాయల భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించగలిగాం. ఇలా వచ్చిన పెట్టుబడులకు.. నూతన పారిశ్రామిక విధానం కింద రకరకాల రాయితీలు కల్పిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం అద్భుత చర్యలు అమలు చేస్తోంది. 14 రంగాలను ప్రాధాన్యత కింద ఎంచుకుని.. పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తోంది. ఆ ప్రాధాన్యత ప్రకారమే వ్యాట్ లో కూడా అవసరమైతే వంద శాతం వరకూ రాయితీలు కల్పిస్తూ.. పారిశ్రామిక రంగాన్ని మరింత వృద్ధిలోకి తెస్తోంది.

ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, వ్యవసాయ ఆధారిత, గ్రానైట్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాల్లో విశేష రీతిలో పెట్టుబడులు ఆకర్షించింది. దేశంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను శరవేగంగా పూర్తి చేయిస్తోంది. వినోదానికి పెద్ద పీట వేస్తూ.. భారీ స్థాయిలో అమ్యూజ్ మెంట్ పార్క్ ఏర్పాటుకూ చర్యలు తీసుకుంటోంది. 270 కోట్ల రూపాయల పెట్టుబడితో.. లెదర్ పరిశ్రమను కూడా ప్రోత్సహిస్తోంది. వరంగల్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రభుత్వం.. త్వరలోనే వాటిని పూర్తి చేసి.. దేశానికే ఆదర్శంగా నిలిచేలా.. మరో సూరత్ లా.. మరో భీవండిలా వరంగల్ వస్త్ర పరిశ్రమను తయారు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తోంది.

ఇంతగా శ్రమిస్తున్న ప్రభుత్వం.. రాష్ట్ర యువతకు ఇప్పటికే 2 లక్షల 30 వేల ఉపాధి అవకాశాలు పారిశ్రామిక రంగ అభివృద్ధితో కల్పించింది. మరో 50 వేల కోట్ల పెట్టుబడులకు దారులు తెరుస్తూ.. 3828 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. దీంతో.. కనీసం మరో 50 వేల ఉద్యోగాలైనా వస్తాయన్న నమ్మకం కలిగింది. ఇలా.. దేశానికే ఆదర్శంగా నిలుస్తూ.. ఈ ఏడాది కూడా పారిశ్రామిక రంగంలో కేసీఆర్ సర్కార్.. అద్భుతమైన చర్యలు తీసుకుంది.

Top