You are here
Home > Latest News > పొత్తులు లేవు.. గిత్తులు లేవు… డైరెక్ట్ ఫైటే!!

పొత్తులు లేవు.. గిత్తులు లేవు… డైరెక్ట్ ఫైటే!!

Spread the love

 

  • – పరువు పోగొట్టుకుంటున్న కేంద్ర మాజీ మంత్రి దత్తన్న
  • – టీఆర్ఎస్ నేతలు అడగకున్నా పొత్తులపై ప్రగల్భాలు
  • – ఒంటరి పోటీ అని కేసీఆర్ చెబుతుంటే… టీఆర్ఎస్ తో పొత్తు లేదు అంటున్న దత్తన్న

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయది అమాయకత్వమో.. అతి తెలివో అర్థం కావడం లేదు. ఓవైపు పొత్తులు లేవు.. ఒంటరి పోటీనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేస్తుంటే… ఆఖరికి మిత్రుత్వం ఉన్న ఎంఐఎంతో కూడా స్నేహపూర్వక పోటీ చేస్తుంటే… దత్తన్న మాత్రం ఎటూ సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్ఎస్ తో పొత్తు లేదు అని కామెంట్ చేసిన దత్తన్నను చూసి… విలేకరులు, ఆ తర్వాత జనాలు ముక్కన వేలేసుకుంటున్నారు.

తన స్థాయిని మరిచి… మరీ ఇలా చీప్ కామెంట్లు చేసిన దత్తన్నను చూసి కొందరు ఆవేదన పడుతుంటే.. మరికొందరు జాలి పడుతున్నారు. ఎన్నికల్లో విజయం ఖాయం, కనీసం 90 సీట్లకు తక్కువ కాకుండా విజయం దక్కించుకోవడం తథ్యం అని టీఆర్ఎస్ ను ప్జలు ఆశీర్వదిస్తుంటే… ఈయనేంది పొత్తులు, గిత్తులు అని మాట్లాడుతున్నాడు అని ప్రజలు ఆశ్చర్యంతో పాటు చికాకును కూడా వ్యక్త పరుస్తున్నారు.

ఇప్పటికైనా బీజేపీ నేతలు ఇలాంటి ప్రచారాలు ఆపకుంటే… ఆ పార్టీ ఉనికికే ప్రమాదమని… ఉన్న ఐదు సీట్లను కూడా బీజేపీ ఓడిపోవడం ఖాయమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు. కనీసం సీనియర్ నాయకులంతా కలిసి ఒక్కటంటే ఒక్క సమావేశంలో అయినా ఒకే వేదికపై కనిపించాలని ప్రజలు కోరుతున్నారు. సీనియర్లు ఓవైపు… ఎమ్మెల్యేలు ఓ వైపు… దిక్కూమొక్కూ లేని నాయకత్వం… సరైన మార్గదర్శకత్వం ఇవ్వలేకపోతున్న జాయతీయ నాయకత్వం… వెరిసి బీజేపీ ఓటమి ఖాయమని స్పష్టమవుతోంది.

ఈ పరిణామాలను దత్తాత్రేయతో పాటు… ఇతర నేతలు కూడా అర్థం చేసుకోవాలని ప్రజలు పిలుపునిస్తున్నారు. ప్రగల్భాలు మానాలని హితవు పలుకుతున్నారు.

Top